ఖమ్మం టీఆర్ఎస్‌లో హీట్ పెంచిన ఎమ్మెల్సీ వ్యాఖ్యలు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అధికార పార్టీ అభ్యర్థికి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష అభ్యర్థికి పడ్డాయి.. పెద్ద సంఖ్యలో క్రాస్ ఓటింగ్ జరగడం చర్చగా మారింది. అయితే, ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఇప్పటికే ప్రకటించిన.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు… తాజాగా చేసిన కామెంట్లు హీట్ పెంచాయి.. ఉమ్మడి ఖమ్మంజిల్లా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తుమ్మల అని వ్యాఖ్యానించిన ఆయన.. నా గెలుపు ఉగాది పచ్చడిలా ఉంది. నా గెలుపులో తీపి వేసింది ఎవరో మీకు తెలుసు, చేదు వేసింది ఎవరో మీకు తెలుసు.. అలానే ఇప్పుడు ఏ తప్పు జరిగిందో 2018లో కూడా అదే తప్పు జరిగిందని పేర్కొన్నారు. తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో అభివృద్ధి జరిగింది.. కానీ, ఈ రోజు రాజకీయాలు అభివృద్ధికి నోచుకునే వారికన్నా డబ్బుకోసం రాజకీయం చేస్తున్న నేతలే ఉన్నారని కామెంట్ చేశారు.
మన పార్టీలో ఉన్న కొంతమంది వల్లే 2018లో ఎమ్మెల్యే లు ఓడిపోయారంటూ హాట్ కామెంట్లు చేసిన తాతా మధు.. తుమ్మల కూడా అలానే ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, తుమ్మల పార్టీలో చేరిన తర్వాతే ఖమ్మంలో టీఆర్ఎస్ బలపడిందని స్పష్టం చేసిన ఆయన.. పార్టీలో ఉండి పార్టీకి అన్యాయం చేయొద్దని.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వారు అసలు పార్టీలో ఎందుకు ఉండాలి అంటూ ప్రశ్నించారు. పార్టీలోకి ఎవరు రమ్మని పిలవలేదన్న ఆయన.. గులాబీ జెండా కింద మనం బతుకుదాం.. నీతి తప్పిన రాజకీయాలు, చిల్లర రాజకీయాలు అసలు వద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.. భారీ మెజార్టీ రావాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఓట్లుకు తూట్లు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసిన మధు… అలానే ఈ పార్టీలో ఉండి వేరే పార్టీలో రాజకీయాలు చేయొద్దు అని చేతులు ఎత్తి వేడుకున్నారు.. మరోవైపు సీఎం కేసీఆర్ అశ్వారావుపేట నియోజకవర్గన్ని మెచ్చుకున్నారని తెలిపిన ఆయన.. మీకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేను నెరవేరుస్తా.. గత ఎమ్మెల్సీ పనిచేశారా? లేదా? అనేది నాకు అనవసరం, నేను మాత్రం అందరితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!