తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాయి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు.. నవంబర్ 31నే ప్రతిపాదనలకు చివరి రోజు కాగా.. డిసెంబర్ 27వ తేదీ వరకు అదనంగా గడువు ఇచ్చింది ఈఆర్సీ.. అయితే ఇప్పటికే ఏఆర్ఆర్లు సమర్పించిన డిస్కమ్స్.. మొత్తంగా 6831 కోట్ల చార్జీల పెంపునకు ప్రతిపాదనలు అందగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇక, విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడిన టీఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి… 20 సంవత్సరాల తర్వాత 50 యూనిట్ల వరకు ఛార్జీలు పెంచలేదని గుర్తుచేశారు… ఇప్పుడే యూనిట్‌కు 50 పైసలు పెంచుతున్నామని ప్రకటించిన ఆయన.. గత ఐదేళ్లుగా టారిఫ్ రివిజన్ లేదని.. డొమెస్టిక్ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచుతామని.. ఇతర వినియోగదారులకు యూనిట్‌కు రూపాయి పెంచాలని భావిస్తున్నామని తెలిపారు రఘుమారెడ్డి. ఈ పెంపు వల్ల రూ.2,110 కోట్ల ఆదాయం డిస్కమ్స్‌కు వస్తోందని వెల్లడించిన ఆయన.. హెచ్.టీ వినియోగదారులకు యూనిట్ కు రూపాయి పెంచాలని భావిస్తున్నాం అని.. దీంతో రూ.4,721 కోట్ల ఆదాయం రావొచ్చన్నారు. మరోవైపు.. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. 25.78 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందుతుందని వెల్లడించారు టీఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి.