ఖమ్మం బ్రాహ్మణ బజార్లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఓ ఖాళీ స్థలంలో ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్న సమయంలో భారీ చెట్టు కూలి పక్కనే ఉన్న గోడ మీద పడింది. దీంతో గోడ కూడా కూలింది. దీంతో గోడ పక్కనే ఆడుకుంటున్న చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు గాయపడగా స్థానికులు వెంటనే వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. Read Also: మీకు కరోనా సోకిందా.. అయితే ఈ మందులు…
★ నేడు ఏపీ వ్యాప్తంగా పురపాలక కార్మికుల ఛలో కలెక్టరేట్ కార్యక్రమం… సమస్యలు పరిష్కరించాలని పురపాలక కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య పిలుపు★ నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాయలసీమలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన… నేడు బనగానపల్లిలో పర్యటించనున్న సోము వీర్రాజు.. నేడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొననున్న సోము వీర్రాజు★ నేడు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం… మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు అధ్యక్షతన సమావేశం… హాజరుకానున్న బండి…
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలో క్రమేపీ కరోనా ఉగ్రరూపం దాల్చడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులను కరోనా కలవరపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు1,400 మంది పోలీసులకు కరోనా రావడంతో డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పోలీసుల్లో పాజిటివ్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 500 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డారు.…
భూదానణ్ పోచంపల్లి మరో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటికే ఈ గ్రామం ఎంతో గుర్తింపును తెచ్చుకోగా తాజాగా ప్రపంచ గుర్తింపు పొందింది.ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఇటీవలే వెలువరించిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక గ్రామాల (Best Tourism Villages) జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామం చోటు దక్కించుకుంది. Read Also: జీవో 317పై స్టే ఇవ్వలేం: హైకోర్టు ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర హై కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 పై తాము స్టే ఇవ్వలేమని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే ఒకసారి తెలంగాణ హై కోర్టు జీవో నెంబర్ 317 పై ఇలాగే స్పందించింది. తాజాగా ఈ రోజు కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయిపుల పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఈ విధంగా…
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు తమిళనాడు గవర్నర్ R.N.రవిని భగవత్ ను ఆహ్వానించారు. ఈరోజు చెన్నైలోని గవర్నర్ నివాసానికి వెళ్లిన చిన్నజీయర్ స్వామి.. ఆహ్వాన పత్రికను అందించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు 1,035 కుండ శ్రీ లక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగనుంది. ఫిబ్రవరి 14న పూర్ణాహుతిలో రాష్ట్రపతి పాల్గొనబోతన్నారు. ఇప్పటికే చిన్నజీయర్ స్వామి దేశవ్యాప్తంగా ఉన్న…
మహబూబ్‌నగర్ నుంచి ఇప్పటికి ఎంతో మంది మంత్రులు వచ్చినా ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అతి త్వరలోనే రూ. 200 కోట్ల నిధులతో కొత్తగా 900 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మంగళవారం జిల్లాలోని బాలానగర్‌లో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం…
తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్ మెంట్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఎప్పుడూ… రాష్ట్ర ప్రజల్ని అలెర్ట్ చేసే డీహెచ్ కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రజలకు కరోనా ముందు జాగ్రత్తలు చెప్పే డీహెచ్ శ్రీనివాస్ రావుకు స్వల్ప స్థాయి లక్షణాలు ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోవడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. Read Also: మానవత్వం లేని మనిషి.. కేసీఆర్…
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లి శవంతో అక్క నాలుగురోజులుగా సహజీవనం చేస్తోంది. చెల్లి మృతి చెందినట్లు ఎవరికి తెలియనివ్వకుండా ఆమె శవం వద్దే కూర్చొని విలపిస్తోంది. చివరికి ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడడం విషయం బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు చెందిన దంపతులకు స్వాతి, శ్వేత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం తల్లి చనిపోగా తండ్రి ఇద్దరు కూతుళ్లను…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. మంత్రి హరీష్ రావు సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతల్ని చెడుగుడు ఆడేస్తుంటారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. 317 జీవో రద్దు అంటే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దు అన్నట్టే అన్నారు మంత్రి హరీష్ రావు. జిల్లాల్లో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీఓ వచ్చింది. ఎవరి మీద పోరాటం చేస్తున్నారో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే…