కేసీఆర్ పై షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. రైతన్నల చావులకు కేసీఆర్ కారణమంటూ దుయ్యబట్టారు. రైతులకు భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎందుకని షర్మిల ఎద్దేవా చేశారు. సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా? రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా? కరోనా వస్తుందనా? లేక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా?మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు? పంట వానపాలు..రైతు కష్టం కన్నీటిపాలు..సాయం దొరమాటలకే చాలు పంట నష్టపోయి,పెట్టిన పెట్టుబడి…
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందని తన కూతురు బతికుండగానే ఓ తండ్రి శ్రద్ధాంజలి ఘటించాడు. గుండు గీయించుకుని దినకర్మలు చేయించాడు. వివరాల్లోకి వెళ్తే… మద్దూరు గ్రామానికి చెందిన మాధవి అనే యువతి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ సమీప బంధువులే కావడంతో తమ ప్రేమను పెద్దల ముందుకు తీసుకువెళ్లారు. అయితే పెద్దలు ససేమిరా అనడంతో ఈనెల 13న గుడిలో పెళ్లి చేసుకున్నారు.…
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో అన్నదాతలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుందామని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన…
★ ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ… కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం★ నేడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 26వ వర్థంతి… ఏపీ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం… ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్న టీడీపీ శ్రేణులు★ నేడు ఏపీలోని 37 గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం… క్యాంప్…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది.. ఈ మేరకు రేపు (మంగళవారం) కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, చీఫ్ సెక్రెటరీ, ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. వర్షా కాలం ధాన్యం కొనుగోళ్లపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. ధాన్యం కొనుగోలు తుదిదశకు చేరిందని కేబినెట్‌కు వివరించారు అధికారులు..…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగింది.. పలు అంశాలపై చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మొదట చర్చ సాగింది.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5…
దేశంలో కరోనా కేసుల స్వల్ప తగ్గుదల నమోదైంది. దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు.కర్ణాటకలో కొత్తగా 27,156 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా 14 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటి…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పైకి కదులుతూనే ఉన్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,447 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 2,295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,11,656కు చేరుకోగా.. రికవరీ కేసులు 6,85,399కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి…
తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా.. ఇద్దరూ ఇద్దరే… సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ.. అన్ని సమస్యలపై స్పందిస్తుంటారు.. వీరి పోస్టులు ఓసారి ఆలోచింపజేస్తే.. మరోసారి నవ్వు పెట్టిస్తాయి.. ఇంకోసారి పెట్టుబడులు తెస్తాయి.. మరికొన్ని సార్లు కొత్త ప్రాజెక్టులకు అడుగులు వేస్తాయి.. అయితే, సోషల్ మీడియా వేదికగా.. ఒకరికొరరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. దానికి ప్రధాన కారణం మాత్రం.. ‘ఫార్ములా ఈ’గానే చెప్పాలి.. ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ’ వరల్డ్ ఛాంపియన్షిప్…