తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 7,22,403గా ఉన్నాయి. కాగా కరోనాతో కోలుకున్న వారి సంఖ్య1,825గా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకుని డిశాచార్జీ అయిన వారి సంఖ్య 6,91,703 గా ఉంది. ఈ రోజు కరోనాతో ఇద్దరూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4,067గా ఉంది. కరోనాతో చికిత్స పొందుతున్న…
బండి సంజయ్ పై మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శల దాడులకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనులకు బీజేపీ ఏమైనా చేసిందా..? బండి సంజయ్ కి సవాల్ విసురుతున్న ..చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు, దళితులకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.బీజేపీ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు.…
కరోనా మరోసారి పంజా విసురుతోంది.. ఒమిక్రాన్ ఎంట్రీతో థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది.. దీంతో.. అన్ని ప్రభుత్వాలు కట్టడి చర్యలకు దిగుతున్నాయి.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా.. రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. మరోవైపు.. ప్రభుత్వం గతంలో విధించిన కరోనా ఆంక్షలు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో.. కోవిడ్ ఆంక్షలు ఈ నెల 31 వరకు పొడిగించింది తెలంగాణ సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. Read Also: కోవిడ్ పంజా.. తెలంగాణ సర్కార్…
మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది.. దేశవ్యాప్తంగా కొత్త రికార్డుల వైపు కోవిడ్ కేసులు పరుగులు పెడుతున్నాయి.. మరోవైపు తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది.. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి హరీష్‌రావు.. ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. ఫీవర్ సర్వేలో కరోనా లక్షణాలున్నవారికి మెడికల్ కిట్ అందజేయనున్నట్టు తెలిపారు.. హోం ఐసొలేషన్ కిట్లు, టెస్టింగ్ కిట్లు,…
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది.. రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కిషన్ రెడ్డే స్వయంగా వెల్లడించారు.. తనకు కోవిడ్ పాజిటివ్‌గా వచ్చింది.. స్వల్ప లక్షణాలు ఉన్నాయన్న ఆయన.. వైద్యుల సూచనల…
తెలంగాణలో తెలుగు అకాడమీ కేసు తరహాలో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ గిడ్డంగుల శాఖలో భారీగా ఫిక్సుడ్ డిపాజిట్ నిధులు మాయం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖకు చెందిన రూ.4 కోట్ల నిధులు గల్లంతు అయ్యాయని తెలుస్తోంది. తప్పుడు ఎఫ్డీ పత్రాలు చూపించి కార్వాన్ యూనియన్ బ్యాంక్ నుంచి ఫిక్సుడ్ డిపాజిట్ నిధులను కొల్లగొట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. గిడ్డంగుల శాఖ అధికారుల ఫిర్యాదుతో ఈ స్కాంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు మూడు విడతల డీఏ బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ బుధవారం రాత్రి జారీ చేసింది. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో 7.28 శాతంగా ఉండే డీఏ 17.29 శాతానికి పెరగనుంది. దీంతో పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలకు బదులుగా ఈ కొత్త లెక్క వర్తించనుంది. పెరిగిన డీఏ…
★ నేడు ఏపీ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి ఫ్యాప్టో పిలుపు.. కొత్త పీఆర్సీకి నిరసనగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ల ముట్టడి.. ఫ్యాప్టో తలపెట్టిన నిరసనలకు ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు.. డివిజన్ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చిన జాక్టో.. భోజన విరామ సమయాల్లో సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. సమ్మెకు వెళ్లాలని ఉద్యోగుల నిర్ణయం★ అమరావతి: ఉండవల్లి హోం ఐసోలేషన్‌లో ఉంటూ నియోజకవర్గాల వారీగా ఆన్లైన్లో సమీక్ష చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు★ కరోనా నియంత్రణపై నేడు తెలంగాణ మంత్రుల…
కరోనా తీవ్రతపై షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ సర్వేలో తేలింది. వచ్చే రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఏఎన్ఎంలు,అంగన్వాడీలు, ఆశవర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఒక్క హైదరాబాద్‌లోనే 15 లక్షల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. త్వరలోనే ఈ సర్వే వివరాలను వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి…