తెలంగాణలో కరోనా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,487 శాంపిల్స్ పరీక్షించగా.. 733 మందికి పాజిటివ్‌గా తేలింది.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,82,336కు పెరిగింది.. ఇదే సమయంలో 2,850 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవడంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య7,62,594కు చేరింది.. మరో వ్యక్తి కోవిడ్‌తో కన్నుమూయగా.. ఇప్పటి వరకు 4,106 మంది మృతిచెందినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15,636 కేసులు యాక్టివ్‌గా ఉండా.. రివకరీ రేటు 97.48గా ఉంది.
Read Also: Polytechnic Paper Leak: పరీక్షలు రద్దు.. మళ్లీ ఎప్పుడంటే..?