ప్రధాని నరేంద్ర మోడీ జాగ్రత్త.. నీ ఉడుత ఊపులకు భయపడం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్… జనగామ బహిరంగసభ వేదికగా.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు కేసీఆర్.. 8 ఏళ్లుగా పైసా ఇవ్వకపోయినా కేంద్రాన్ని ఏమీ అనలేదన్న ఆయన.. అడ్డగోలుగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు.. ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో కొత్త పంచాయితీ పెడుతున్నారు.. ప్రతీ మోటారుకు విద్యుత్ మీటరు పెట్టాలంటున్నారని ఫైర్ అయ్యారు.. కానీ, నన్ను చంపినా తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా గతంలో మీటర్లు పెట్టమన్నాడు.. అలా చెప్పే వెళ్లిపోయాడంటూ ఎద్దేవా చేశారు కేసీఆర్.
Read Also: Komatireddy: కొబ్బరికాయ కొట్టించిన కేసీఆర్.. ప్రశంసలు కురిపించిన కోమటిరెడ్డి..!
కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం అన్నారు కేసీఆర్.. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు, ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వరు, మనం పండించిన పంట కూడా కొనరు.. కానీ, విద్యుత్ మీటర్లు పెడతామంటున్నారంటూ మండిపడ్డారు తెలంగాణ సీఎం.. ఇక, మిమ్మల్ని దేశం నుంచి తరిమేస్తాం.. మాకు ఇచ్చేవాళ్లను తెచ్చుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.. అవసరమైతే దేశం కోసం కొట్లాడడానికైనా సిద్ధమే.. ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా సిద్ధమే అని ప్రకటించారు.. జాగ్రత్త నరేంద్ర మోడీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ.. నీ ఉడుత ఊపులకు భయపడేది లేదన్నారు.. బీజేపీ బిడ్డల్లారా మేం ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే మాత్రం.. వదిలిపెట్టం అని హెచ్చరించారు.. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన పార్టీ.. ఇలాంటి వాళ్ల ఉడుత బెదిరింపులకు భయపడుతుందా? మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్.. దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడ్డానికి సిద్ధం.. సిద్దిపేట వాళ్లు పంపిస్తే తెలంగాణ సాధించాం.. మీరందరు పంపిస్తే ఢిల్లీ గోడలు బద్ధలు కొడతామని ప్రకటించారు.