జనగామలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో.. తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతారంటూ ప్రచారం జరిగింది.. దానికి ప్రధాన కారణం రాజ్యసభ వేదికగా మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలే కారణం.. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మాటల దాడికి దిగుతున్నారు.. అయితే, ఇవాళ కేంద్రాన్ని, ప్రధాని మోడీని, బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేసినా.. నరేంద్ర మోడీ చేసిన ఆ వ్యాఖ్యల జోలికి మాత్రం పోలేదు.. దీనిపై సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Read Also: High Court: పోలీసులపై సంచలన వ్యాఖ్యలు.. 90 శాతం అవినీతిపరులే..!
తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నించిన నరేంద్ర మోడీని ప్రశ్నించడానికి కేసీఆర్‌కు అంత భయమెందుకు!? అంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి… అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అవమానిస్తుంటే నికార్సైన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషంతో తిరగబడతారు… కానీ, జనగాం ప్రసంగం తర్వాత ‘కేసీఆర్ ఖేల్ ఖతం’ అన్న విషయం అర్థమైంది.. అంటూ సెటైర్లు వేశారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కాగా, జనగామ వేదికగా కేంద్రాన్ని, ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేసీఆర్.. తెలంగాణలో మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టేదే లేదని స్పష్టం చేశారు.. తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని.. మిమ్మల్ని దేశం నుంచి తరిమేస్తాం.. మాకు ఇచ్చేవారినే తెచ్చుకుంటాం అంటూ మోడీపై మండిపడ్డ విషయం తెలిసిందే.
తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నించిన మోదీని ప్రశ్నించడానికి కేసీఆర్ కు అంత భయమెందుకు!?
— Revanth Reddy (@revanth_anumula) February 11, 2022
అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అవమానిస్తుంటే నికార్సైన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషంతో తిరగబడతారు…
జనగాం ప్రసంగం తర్వాత
‘కేసీఆర్ ఖేల్ ఖతం’ అన్న విషయం అర్థమైంది.#ByeByeKCR