ప్రధాని నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమేస్తామంటూ హెచ్చరించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చారు.. జనగామలో జరిగిన గొడవపై స్పందిచిన కేసార్.. పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేం మంచివాళ్లం మిమ్మల్ని ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.. మా శక్తి ముందర మీరు ఎంత? మేం ఊదితే అడ్రస్ లేకుండా పోతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు సీఎం కేసీఆర్..
Read Also: KCR Targets Modi: ఖబడ్దార్ మోడీ.. దేశం నుంచి నిన్ను తరిమేస్తాం..
ఇక, జనగామ వేదికగా ప్రధాని మోడీని టార్గెట్ చేశారు కేసీఆర్.. ఏ రాష్ట్రం పాలసీ ఆ రాష్ట్రానికి ఉండాలని కేంద్రాన్ని పలుమార్లు కోరానన్న ఆయన.. కరెంట్ సంస్కరణల పేరిట మోడీ కొత్త పంచాయతీ పెట్టారని మండిపడ్డారు.. ప్రతి మోటార్‌కు మీటర్ పెట్టాలని అంటే.. నన్ను చంపినా పెట్టనని చెప్పానన్న ఆయన.. ఎందుకంటే రైతు పంట పండిస్తే రైతే బతకడు కదా? ఇప్పుడు డిజీల్ రేట్లు పెరిగాయి. దాంతో రైతులకు ట్రాక్టర్లతో దున్నడం భారమైంది. ఆదాయం రెట్టింపు చేయడం ఏమో కానీ.. రైతుల పెట్టుబడి రెట్టింపు చేసిండు మోడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం అడిగినా ఇవ్వడంలేదు.. అని మిమ్మల్ని దేశం నుంచి తరిమిస్తేం.. మాకు అన్నీ ఇచ్చేవారినే తెచ్చుకుంటామనంటూ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.