ఉద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్.. జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను కొనియాడారు… అందరి కృషివల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందున్న ఆయన.. గతంలో కరెంట్ సమస్య ఉండేదని.. ఆ సమస్య లేకుండా చేశామని గుర్తుచేశారు.. ఇక, ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోవద్దని సూచించారు ముఖ్యమంత్రి.. తెలంగాణ ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపిన ఆయన.. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయంటూ తీపికబురు చెప్పారు.
Read Also: Shashank Goyal: కేంద్రం ఆదేశాలు.. శశాంక్ గోయల్ రిలీవ్
భారత దేశవ్యాప్తంగా 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 7 గ్రామాలు మన రాష్ట్రంలోనివే అని గుర్తుచేశారు సీఎం కేసీఆర్.. పట్టుదలతో, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఇలాంటి సాధ్యమయ్యాయన్న ఆయన.. ఇక, విద్యుత్‌శాఖ ఉద్యోగులు రాత్రిపగలు కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు.. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు వేర్వేరు కాదని స్పష్టం చేశారు.. ఒకప్పుడు జనగామ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేవి.. అప్పట్లో జనగామలో మంచినీళ్లు కూడా ఉండని పరిస్థితి ఉండేదన్న ఆయన.. ఎంతోమంది వలసపోయారు… అప్పటి పరిస్థితి చూసి ఎంతో బాధపడ్డాను.. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకున్నాం… అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.. అంతేకాదు. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగింది.. త్వరలో తలసరి ఆదాయం రూ.2.70లక్షలకు చేరబోతుందన్నారు సీఎం.. మరోవైపు.. భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయని.. హైదరాబాద్‌లో 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారంటూ.. ఏ స్థాయిలో పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు.. ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఫ్లాట్లు, విల్లాలు, భూములు కొంటున్నారని తెలిపారు.. మరోవైపు.. జోనల్ వ్యవస్థపై ఆయన మాట్లాడుతూ.. జోనల్ వ్యవస్థతో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.. అవగాహన లేక కొందరు వ్యతిరేకించారని ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్.