ఆదివారం సాయంత్రం పటాన్‌చెరువులో పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. రూ. 8.30 కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. రూ. 3.40 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ బిల్డింగ్‌తో పాటు రూ. 3.85 కోట్లతో ఆధునీకరించిన మైత్రి క్రీడా మైదానాన్ని.. అలాగే రూ. 1.10 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏడున్నర కోట్లతో పటాన్చెరువు స్టేడియం నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా…
తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం vs బీజేపీ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే! కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. అసలు కేంద్రం రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు వారి వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. డప్పు కొట్టుకోవడం తప్పిస్తే, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని టీఆర్ఎస్ తిప్పికొడుతోంది. కానీ, బీజేపీ నేతలు…
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి చురుగ్గా పాల్గొంటున్నారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో మోరీలను సాఫ్ చేస్తూ.. పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ..ప్రజలను భాగస్వాములను చేస్తూ.. ఉత్తేజ పరుస్తూ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా…
సూరీడు సుర్రుమంటున్నాడు. పొద్దున 8 దాటకముందే చెమటలు పట్టిస్తున్నాడు. మధ్యాహ్నం నడినెత్తి మీదకు వచ్చేసరికి జనానికి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సాయంత్రం ఆరు వరకు భానుడి భగభగల నుంచి జనానికి ఉపశమనం లభించడంలేదు. రాత్రివేళల్లోనూ వేడి గాలులతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో సూర్యుడి ప్రతాపం ఏ రేంజ్లో ఉంటుందోనని జనం భయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూరీడు తన…
తెలంగాణ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోటు రోడ్డు ప్రమాద వార్తలు విషాదం నింపుతున్నాయి. రహదారులు రక్తమోడేలా చేస్తున్నాయి. తాజాగా వాహనం టైరు పేలి ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద చోటుచేసుకుంది. 10 మంది ప్రయాణికులతో వున్న టవేరా వాహనం హనుమకొండ నుండి హైదరాబాద్ కు బయలు దేరింది. ఒక్కసారిగా సబ్దం రావడంతో.. స్థానికులు పరుగులు పెట్టారు. టవేరా వాహనం…
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మణ్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ ఘనస్వాగతం పలికింది. అనంతరం నాంపల్లిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లక్ష్మణ్ మాట్లాడారు. యాదాద్రిలో సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. సరైన సదుపాయాలు కల్పించకుండానే దేవాలయ దర్శనాలకు అనుమతులు ఎలా ఇచ్చారని…
నాలుగు రోజుల క్రితం అదృశ్యమై వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం రసూల్ గూడలో గత నెల 31న రాజశేఖర్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అయితే ఆయనను దారణంగా హత్య చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. రాజశేఖర్ మృతదేహాన్ని ఆయన పొలానికి సమీపంలోనే నిందితుడు పూడ్చిపెట్టారు. మృతదేహాన్ని వెలికి తీసి సంఘటన స్థలంలోనే డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. నల్గొండ డీఎస్పీ, స్థానిక ఎమ్మార్వో ఇద్దరు డాక్టర్ల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. అదృశ్యం అయిన రోజే…
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను, 15వ ఆర్థిక సంఘం నిధులను గత కొద్ది నెలలుగా నిలిపివేసిందని, దీనివల్ల స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతున్నదని సర్పంచుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నాయకులు కలిసిశారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదని , కేంద్ర నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులు వచ్చేలా కేంద్రంపై వత్తిడి తేవాలని విజ్ఞప్తిచేశామన్నారు.…
టీ-కాంగ్రెస్ మినీ చింతన్ శిబర్ కు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గైర్హాజరు కావడం అందరినీ కలచివేసింది. అయితే రేవంత్ ఎక్కడ? అని అందరూ ఆరాతీస్తుంటే రేవంత్ మాత్రం అమెరికాలో వాలిపోయాడు. రేవంత్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పరిశీలిస్తే రేవంత్ రెడ్డి ప్రస్తుతం యునైటెడ్ స్టేట్ లోని డల్లాస్ లో ఉన్నారు. అక్కడ తన యుఎస్ టూర్లో రేవంత్ ఎన్నారై కమ్యూనిటీ నుండి మద్దతు కోసం పర్యటిస్తున్నారు. . తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా…
ఆమ్నేషియా పబ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పెద్దపెద్ద వ్యక్తుల కుమారులు ఉన్నట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఏకంగా హోంమంత్రి మనవడు కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన పెద్ద వ్యక్తి కుమారుడు, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఓ పత్రికా ఎండీ కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మరోవైపు రాజాసింగ్…