Errabelli Dayakar Rao: పల్లెప్రగతిలో జోష్ నింపిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి చురుగ్గా పాల్గొంటున్నారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో మోరీలను సాఫ్ చేస్తూ.. పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ..ప్రజలను భాగస్వాములను చేస్తూ.. ఉత్తేజ పరుస్తూ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఈ నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి గ్రామంలో వాడవాడలా తిరిగారు. ప్రజలతో మాట్లాడుతూ పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించారు. చెత్తా చెదారం ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కాలువల్లో మట్టి, చెత్త పేరుకుపోవడం చూసి వెంటనే మంత్రి స్వయంగా తొలగించారు.
Also Read
అలాగే గ్రామస్థులను పలకరిస్తూ వారి యోగ క్షేమాలను అడి తెలుసుకున్నారు. కొడకండ్ల మండలం రేగులలో మంత్రి ఉపాధి హామీ కూలీలతో మమేకం అయ్యారు. వారితో కలిసి పని చేశారు. ఉపాధి కూలీలు పెట్టిన చద్దన్నం తిన్నారు. ఆ బువ్వ కమ్మగా ఉందంటూ.. అందరినీ సంతోష పెట్టారు. అందరితో ఔరా!. అనిపించుకుంటూ..సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పల్లె ప్రగతి కార్యక్రమాలకు బయలుదేరారు.
Collector Nikhil: విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. నలుగురు కార్యదర్శులు సస్పెన్షన్
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..