తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించాలని నిర్ణయించుకుంది బిజెపి. దక్షిణాదిలో మరో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్ర నేతలు కూడా ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణపై దృష్టి పెట్టామని..రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని ఇక్కడి నేతలకు బలమైన సంకేతాలు ఇచ్చేలా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోడీ హైదారాబాద్‌కు వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో ప్రసంగించారు. పార్టీ ముఖ్య నేతలు సైతం తెలంగాణలో రెగ్యులర్‌గా పర్యటిస్తున్నారు.…
పల్లె నిద్రలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని రంగాపూర్ గ్రామంలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు పరిశీలించిన ఆయన.. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామని.. ప్రతి ఊరికి మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్నామని చెప్పారు. దశలవారీగా అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడం,…
భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించే ఆషాఢ బోనాలు ముహూర్థం ఖరారైంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి బోనాల వేడుకపై సమీక్ష నిర్వహించారు. అనంతరం తేదీలను ఖరారు చేశారు. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాఢ భోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 24న భాగ్యనగర బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలు…
ఒక్క రక్తపు బొట్టు నేల చిందకుండా సాకారమైన ఆశయం. పిల్లల నుంచి పెద్దల వరకు, స్కూల్ విద్యార్థి నుంచి విశ్వవిద్యాలయం స్కాలర్ వరకు, కూలీ నుంచి ఉన్నతాధికారి వరకు, ప్రతి ఒక్కరూ ఉద్యమ పతాకలైన సందర్భం తెలంగాణ ఉద్యమం. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు… కొన్ని రక్తపు నేలలపై నడిచి యుద్ధాలుగా ముగిశాయి. కొన్ని లక్ష్య తీరాలను చేరి.. శాంతి పోరాటాలుగా భాసిల్లాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఈ రెండు మార్గాలూ కనిపిస్తాయి. అతి, మిత వాదుల…
అమ్నేసియా పబ్ కేసు విషయమై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బాలికపై గ్యాంగ్ రేప్ కేసును సుమోటోగా మహిళా కమిషన్ స్వీకరించింది. సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీకి మహిళ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేసు రిపోర్ట్ చూసిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సునీతా లక్ష్మారెడ్డి…
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నారాయణ పేట జిల్లాలో ఇవాళ (సోమవారం) పర్యటించనున్నారు. నారాయణ పేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణ పేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ. 64కోట్ల 43 లక్షల 19వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకుమంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. నారాయణపేట పట్టణం నుంచి ఎక్లాస్పూర్ మీదుగా తెలంగాణ కర్ణాటక సరిహద్దు…
అతడు పాత నేరస్థుడు కాదు, అతనిపై కేసులు అస్సలు లేవు.. అక్కడేమి పెద్ద గొడవ కూడా కాలేదు. అస్సలు అతని తప్పేమీ లేదు. కేవలం తోపులాట. అయితే ఆ సీన్ ను ఓ సినిమాలో చూపించి నట్లుగా పోలీసులు వ్యవహరించారు. అవతలి వ్యక్తి ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకుని.. నిజానిజాలు పరిశీలించకుండా.. నేరం చేయని వాడిపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనను స్థానికుడు ఒకరు బాత్రూంలో ఉంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.…
డాక్టర్ కె లక్ష్మణ్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా.. అసెంబ్లీలో బీజేపీ పక్ష ఉపనేతగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ పదోన్నతిపై తెలంగాణ బీజేపీ నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నా.. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ముషీరాబాద్‌లో లక్ష్మణ్‌ను రీప్లేస్ చేసేది ఎవరన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది. మొన్నటి వరకు ముషీరాబాద్ అంటే లక్ష్మణ్,.. లక్ష్మణ్ అంటే ముషీరాబాద్ అన్నట్టుగా బీజేపీలో చర్చ ఉండేది. కానీ.. రానున్న రోజుల్లో ముషీరాబాద్…
ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. దీంతో జనం ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా జనం ఉక్కపోత నుంచి ఊరట పొందారు. భాగ్యనంగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసాయి. జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్మెట్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో జల్లులు కురుసాయి. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురువగా.. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇదిలా…