6 ఎయిర్‌బ్యాగ్స్, కొత్త డిజైన్, కొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చేసిన Kia Seltos 2026.. ఫీచర్స్ ఇవే..!
- కియా ఇండియా Kia Seltos 2026 మోడల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్
- ప్రారంభ ధర రూ.10.99 లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ.19.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- కొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీతో మరింత ప్రీమియం లుక్
- కొత్త Tiger Nose గ్రిల్, ఆధునిక LED హెడ్‌ల్యాంప్స్ & కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్
- కొత్త టెయిల్ గేట్ డిజైన్, అప్డేటెడ్ బంపర్స్
- 18 అంగుళాల అలాయ్ వీల్స్, గన్మెటల్ ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kia Seltos 2026: కియా ఇండియా (Kia India) తన కొత్త జెనరేషన్ సెల్టాస్ SUVను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. కొత్త డిజైన్, కొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.19.99 లక్షలు వరకు ఉంది. డిజైన్ పరంగా 2026 కియా సెల్టాస్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముందు భాగంలో కొత్త టైగర్ నోస్ గ్రిల్, ఆధునిక LED లైటింగ్ ఎలిమెంట్స్, ఆకర్షణీయమైన కొత్త బంపర్లు ఇచ్చారు. వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ తో పాటు కొత్త టెయిల్ గేట్ డిజైన్ అందించారు. మొత్తం మీద ఈ డిజైన్ అప్డేట్స్తో కొత్త సెల్టాస్ మరింత ప్రీమియం మరియు స్పోర్టీ లుక్ ను సొంతం చేసుకుంది.
రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో Kia Seltos 2026 భారత్‌లో లాంచ్.. ఏ మోడల్ ఎంత ధరంటే..?
Also Read
- 150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
- 370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
- VinFast VF 2: టాటా నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కారు.. VinFast కొత్త ఎలక్ట్రిక్ కారు.. 18.3kWh బ్యాటరీ, 210KM రేంజ్
- Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S కు భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 7 సీటర్ SUVలో సరికొత్త రికార్డు!
K3 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన ఈ SUV, ఇప్పుడు 4,460 mm పొడవు, 1,830 mm వెడల్పు, 1,635 mm ఎత్తుతో తన సెగ్మెంట్లో పెద్దదిగా నిలుస్తోంది. వీల్‌బేస్‌ను 80 mm పెంచి 2,690 mmకు తీసుకువచ్చారు. కొత్త 18 అంగుళాల అలాయ్ వీల్స్, గన్మెటల్ ఫినిష్ స్కిడ్ ప్లేట్స్, అప్రైట్ ప్రొఫైల్ ఈ కార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో.. కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్, డ్యుల్-టోన్ హైలైట్స్, లెదరెట్ అప్హోల్స్టరీతో క్యాబిన్ మరింత ఆధునికంగా మారింది. 30 అంగుళాల కర్వ్డ్ డ్యువల్ స్క్రీన్ సెటప్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఫిజికల్, రోటరీ కంట్రోల్స్ వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.
ఫీచర్ల పరంగా కొత్త సెల్టాస్లో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, సీట్స్ వెంటిలేషన్, వైర్లెస్ ఛార్జర్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), పవర్డ్ డ్రైవర్ సీట్స్, ORVM మెమోరీ ఫంక్షన్, 8-స్పీకర్ Bose ఆడియో సిస్టమ్, అంబియంట్ లైటింగ్, రియర్ రీక్లైనింగ్ సీట్స్, స్మార్ట్ ప్రోక్సిమిటీ కీ వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
Jason Gillespie: అందుకే పాక్ జట్టు కోచ్‌గా తప్పుకున్న: జేసన్ గిలెస్పీ
సేఫ్టీ విషయంలో కియా ఎలాంటి రాజీ పడలేదు. ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-స్టార్ట్ అసిస్టు, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, OTA అప్డేట్స్ తో పాటు లెవల్-2 ADAS ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో లేన్-కీపింగ్ అసిస్టు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. అలాగే ఇందులో స్నో, మడ్, సాండ్ వంటి ట్రాక్షన్ మోడ్లు కూడా ఉన్నాయి.
పవర్ట్రైన్ విషయానికి వస్తే 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (115 hp, 144 Nm), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 hp, 253 Nm), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (116 hp, 250 Nm) ఆప్షన్లు లభిస్తాయి. వీటికి MT, iVT, DCT, AT ట్రాన్స్మిషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా భారత మార్కెట్లో కొత్త కియా సెల్టాస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, టాటా సియెర్రా వంటి ప్రముఖ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
తాజావార్తలు
-
Delhi Police: రీల్స్ చేసే వారు జర్నలిస్టులు కాదు.. సుప్రీంకు ఢిల్లీ పోలీసుల నివేదిక!
-
Cyclone Akvan: నెమ్మదిగా కదులుతున్న “అక్వాన్ తుఫాన్”.. మరింత డేంజర్ అంటున్న సైంటిస్టులు.!
-
Vikalp Tiwari: టీ20ల్లో మరో యువ సంచలనం.. రెండో భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
స్నాప్‌చాట్ కేంద్రంగా హైటెక్ డ్రగ్స్ దందా గుట్టురట్టు.. క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు!
-
Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. వెనక్కి తగ్గే వరకు పోరాటం..!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..