Summer Season: సుర్రుమంటున్న సూరీడు .. జంకుతున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూరీడు సుర్రుమంటున్నాడు. పొద్దున 8 దాటకముందే చెమటలు పట్టిస్తున్నాడు. మధ్యాహ్నం నడినెత్తి మీదకు వచ్చేసరికి జనానికి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సాయంత్రం ఆరు వరకు భానుడి భగభగల నుంచి జనానికి ఉపశమనం లభించడంలేదు. రాత్రివేళల్లోనూ వేడి గాలులతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో సూర్యుడి ప్రతాపం ఏ రేంజ్‌లో ఉంటుందోనని జనం భయపడుతున్నారు.
ఇక రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోహిణి కార్తెలో కొట్టే ఎండలకు రోళ్లు పలుగుతాయనే నానుడిని నిజం చేస్తూ భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు. సూర్యుడు నిప్పుల కుంపటిగా మారడంతో పాటు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
తప్పనిసరి బయటకు వెళ్తే ఎండ వేడిని తట్టుకునేందుకు గొడుగు, నెత్తికి క్యాపులు, రుమాళ్లు, స్కార్ఫ్‌లు లాంటివి వినియోగిస్తున్నారు. ఎండలో ఎక్కువ సేపు ఉండడం వల్ల కొందరు వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గ్రామాల్లో కూలీలు, రైతులు ఉపాధి హామీ, వ్యవసాయ పనులకు ఉదయం 5 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలలోపు ఇండ్లకు చేరుకుంటున్నారు. అయితే.. సాధ్యమైనంత వరకు ఉదయమే పనులు ముగించుకుని 10 గంటలలోపు ఇండ్లలోకి చేరే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రానున్న రెండుమూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు, వడ గాలులు సైతం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలని పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు పెరిగిపోతాయని వాతావరణ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?