తెలంగాణపై బీజేపీ గట్టి గురిపెట్టిందనడానికి వరుస పరిణామాలే నిదర్శనం. అగ్రనేతలంతా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుండటమే అందుకు ఉదాహరణ. గతనెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో బిజెపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. ఆయన పర్యటనలో స్వాగతం, వీడ్కోలు పలికే దగ్గర చోటామోటా బిజెపి నేతలకు అవకాశం వచ్చింది. గ్రేటర్ కార్పొరేటర్ లను కూడా కలిసే కార్యక్రమం ప్రోగ్రామ్ లో వున్నా, వర్షం…
రోడ్లమీద లారీలు భారీ లోడ్ తో వెళుతుంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యమో.. రోడ్డు మీద సమస్య వల్ల లారీలు బోర్లాపడుతుంటాయి. ఆ లారీల్లో బీరు బాటిళ్ళు, సెల్ ఫోన్లు, చేపల లోడ్ వి అయితే సమీప ప్రాంతాల ప్రజలకు పండగే పండుగ. తాజాగా భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద అదుపు తప్పి చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. ఘటనస్థలానికి భారీగా తరలివచ్చిన జనం పండుగ చేసుకున్నారు. నిమిషాల్లో లారీ లోడ్ చేపల్ని మాయం చేసేశారు. భద్రాద్రి…
తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచార ఘటన కేసు రోజు రోజుకు విచిత్రంగా మారుతోందన్నారు. రాజకీయ నాయకుల పిల్లలను కాపాడాలని పోలీసులు చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేసినా మూడు రోజుల వరకు ఎందుకు పట్టించుకోలేదని గీతారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. పబ్స్ కి , డ్రగ్స్ కి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. అసలు పబ్స్ కి అనుమతులు…
తెలంగాణలో పోలీస్ అధికారులకు హైకోర్టు 4 వారాల జైలు శిక్ష విధించింది. నలుగురు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించింది. నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది. నలుగురికి 4 వారాల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని నలుగురిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని పోలీసులపై అభియోగం నమోదైంది. Niranjan Reddy: త్వరలోనే ఇంగ్లీష్…
నారాయణపేట జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అప్పక్ పల్లి గ్రామ శివారులో రూ.56 కోట్ల వ్యయంతో 390 పడకల జిల్లా…
తెలంగాణపై ఎన్నడూలేనంతగా ద్రుష్టిపెట్టింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ టు తెలంగాణ గల్లీ అంటూ అలజడి పెంచుతోంది. హస్తిన పెద్దలు హైదరాబాద్ లో వరుసగా ల్యాండవుతున్నారు. తెలంగాణపై వాగ్ధానాలు కురిపిస్తూనే, టీఆర్ఎస్ సర్కారుపై వాగ్భాణాలు సంధిస్తున్నారు. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా వాలిపోతున్నారు. ప్రతి సమస్యపైనా జెట్ స్పీడ్ తో రియాక్ట్ అవుతున్నారు. ఒకరకంగా కాషాయదళం దండయాత్ర మొదలుపెట్టింది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పించ్ హిట్టింగ్ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. అందులో భాగంగానే ఏకంగా జాతీయ…
ఆదిలాబాద్ జిల్లా బిజెపిలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికలు ఇప్పడప్పుడే లేకున్నా టికెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అదిష్టానం మెప్పు కోసం వేర్వేరుగానే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఐతే ఉన్నట్టుండి బిజెపీ నాయకురాలు, మాజీ జెడ్పి చైర్పర్సన్ సుహాసిని రెడ్డి టిఆర్ఎస్లో చేరబోతున్నారని ప్రచారం షురూ చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఫొటో కలిపి ఓ న్యూస్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇది సుహాసిని రెడ్డి వ్యతిరేక వర్గం వాట్సాప్ స్టేటస్‌లో..అటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు…
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు చింతన్ శిబిర్ నిర్వహించింది. నాయకులు వచ్చారు…తీర్మానాలు చేసి వెళ్ళారు. కానీ…నాయకులు..క్యాడర్‌కి ఏం చెప్పారనే చర్చ మొదలైంది. చింతన్ శిబిర్‌లో వేసిన కమిటీ చైర్మన్ల సమావేశం ముగియక ముందే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ వెళ్ళిపోయారు. నాయకులు అంతా..మనసు విప్పి చెప్పండి సమస్యలు అంటే…ఇన్నాళ్ళు గోప్యంగా నడిచిన వ్యవహారం అంతా…నాయకులు ఓపెన్ చేశారు. సమస్యలు బయటకు చెప్పిన వారంతా…ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కనీసం టాగూర్ చెప్పిన సమస్యలకు సమాధానం…