టీ-కాంగ్రెస్ మినీ చింతన్ శిబర్ కు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గైర్హాజరు కావడం అందరినీ కలచివేసింది. అయితే రేవంత్ ఎక్కడ? అని అందరూ ఆరాతీస్తుంటే రేవంత్ మాత్రం అమెరికాలో వాలిపోయాడు. రేవంత్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పరిశీలిస్తే రేవంత్ రెడ్డి ప్రస్తుతం యునైటెడ్ స్టేట్ లోని డల్లాస్ లో ఉన్నారు. అక్కడ తన యుఎస్ టూర్లో రేవంత్ ఎన్నారై కమ్యూనిటీ నుండి మద్దతు కోసం పర్యటిస్తున్నారు. . తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డల్లాస్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే 6000 ఎకరాలు సాగు చేస్తున్న రైతును రేవంత్ అడిగితెలుసుకున్నారు.
డెల్లాస్ సందర్శించిన అనంతరం టేనస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లే సిటీని రేవంత్ రెడ్డి పర్యటించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నాష్‌విల్లే బృందం స్థానిక తెలుగు ప్రజలతో సమావేశంలో.. ప్రస్తుత వ్యవహారాలపై చర్చించారు. జూలై 1-3 తేదీలలో వాషింగ్టన్ DCలో యూత్ కాన్ఫరెన్స్, నాష్‌విల్లేను సందర్శించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాదిన్నర సమయం ఉండటంతో ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న రైతులను తమవైపు తిప్పుకునేందుకు రేవంత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ను రేవంత్ టీ-కాంగ్రెస్లు తమను అధికారంలోకి తీసుకొచ్చే ఆయుధంగా భావిస్తున్నారు.
AP SSC Exams : నేడు పదో తరగతి ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..