Road Accident: పేలిన టైరు.. మృత్యుఒడికి ముగ్గురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోటు రోడ్డు ప్రమాద వార్తలు విషాదం నింపుతున్నాయి. రహదారులు రక్తమోడేలా చేస్తున్నాయి. తాజాగా వాహనం టైరు పేలి ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద చోటుచేసుకుంది. 10 మంది ప్రయాణికులతో వున్న టవేరా వాహనం హనుమకొండ నుండి హైదరాబాద్ కు బయలు దేరింది. ఒక్కసారిగా సబ్దం రావడంతో.. స్థానికులు పరుగులు పెట్టారు. టవేరా వాహనం టైరు పేలి ముగ్గరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇక ఇలాంటి ఘటనే ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగరం వద్ద 163 జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతులను ములుగు మండలంలోని జాకారానికి చెందిన వల్లాల కృష్ణయ్య (45), వరంగల్‌కు చెందిన శివ (17)గా గుర్తించారు. తునికాకు సేకరణ కోసం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Kabaddi Tournament : వేములవాడలో కబడ్డీ సందడి.. 33 జిల్లాల నుంచి 68 జట్లు.!
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!