తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఇటీవల మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. బండ ప్రకాష్ రాజీనామాతో ఏర్పడిని ఖాళీతో పాటు డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్మీకాంతరావు పదవీ కాలం ముగియడంతో రెండు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు రాజ్యసభ స్థానాలకు గాయత్రి రవి, హెటిరో అధినేత పార్థసారధి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు…
దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి పోటీ లేదని, రాష్ట్రంలోని పల్లెలకు, పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మొదటి రోజు పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25, 39, 9, 36 వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మంచి నాగరిక సమాజం తయారు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం వయసులో తక్కువ అయినా దేశంలో ఉన్నా మిగతా అన్ని రాష్ట్రాల్లోకెల్లా అభివృద్ధిలో ఒకడుగు ముందే…
50 వేల జనాభా ఉన్న ప్రతి మున్సిపాలిటీలో త్వరలో వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2021-22 ఏడాదికి పురపాలకశాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. 141 మున్సిపాలిటీల్లో రూ.3700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని , ప్రతి నెలా మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. అన్ని పట్టణాల్లో టెన్ పాయింట్ ఎజెండాతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల అదనపు…
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే సామెతను మనం ఎప్పుడూ అంటుంటాము. ఇంట్లోనే చోరీకి పాల్పడి ఏమీ తెలియనట్లు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయంచడం అన్నమాట. అదికాస్త కేసు నమోదు చేసుకున్న పోలీసులకు తలపెట్టునేంత పని అవుతుంది. ఆ కేసును ఛేదించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. అయితే ఆ వస్తువు ఇంటిలోనే వుంటే.. ఇలాంటి ఘటనే కొద్దిరోజుల క్రితమే జరిగింది. హైదరాబాద్ లోని ఓ మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో ఖరీదైన…
రాష్ట్ర అవతరణ దినోత్సవంలో అల్లూరి సీత రామరాజును తెలంగాణ ఉద్యమ కారునిగా కొలిచారని బీజేపీ నేతలు వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు తెలంగాణపై ఉన్న సోయి ఏంటో అర్థం అయిందని ఎద్దేవ చేశారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలకు కిషన్ రెడ్డి బసవన్నలా తలవూపడం విడ్డూరంగా వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిర్భావ వేడుకల్లో పచ్చి అబద్దాలు మాట్లాడారని మండి పడ్డారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై కేటీఆర్ సవాల్ కు…
సైక్లింగ్ కూడా పర్యావరణానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని. ఈ రోజుల్లో కూడా మంది సైకిల్ తొక్కడానికి ఇష్టపడుతున్నారు. దీనిని ప్రోత్సహించడానికి ప్రపంచ సైకిల్ దినోత్సవం 2022 ను ప్రతి సంవత్సరం జూన్ 3 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వరల్డ్ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జిల్లా అధికారులు, స్థానికులతో కలిసి ఇంద్రకరణ్ రెడ్డి 15 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి అందర్నీ ఆశ్చర్యపరిచారు.…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి 15 రోజుల పాటు జరగనున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే 4 విడతలుగా జరిగిన ఈ కార్యక్రమంలో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్ర, పచ్చదనంతో వెల్లివిరిసేలా చేసేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా ఐదో విడతలో భాగంగా తొలి రోజు గ్రామ సభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళిక తయారు చేయాలి. పంచాయతీల ఆదాయ వ్యయాలు, నాలుగు విడతల్లో సాధించిన ఫలితాలను నివేదిక రూపంలో…
★ ఢిల్లీ: ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ ★ కాకినాడ జిల్లా: నేడు జిల్లాలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ పర్యటన.. సాయంత్రం 4:30 గంటలకు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని.. సా.6 గంటలకు పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్న సునీల్ దియోధర్ ★ గుంటూరు: సోషల్ మీడియాలో పోస్టులపై అచ్చెన్నాయుడు పీఏ వెంకటేష్‌ను రెండో రోజు విచరించనున్న సీఐడీ పోలీసులు ★ బాపట్ల జిల్లా: నేడు…
బీజేపీ అధిష్టానం తెలంగాణ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. వచ్చే నెలలో జరగబోయే బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని ఇందుకు అనుకూలంగా మార్చుకోనున్నాయి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ లోపే మరింతగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. తాజాగా రాష్ట్ర బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఎందుకు అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా వివరించాలని హైకమాండ్ ఆదేశించింది. సమావేశాల గురించి ప్రతీ బూత్ స్థాయిలో తెలిసే విధంగా…
ఎనిమిదేళ్ల క్రితం కొత్త రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు ఉండేవని కానీ ఎనిమిదేళ్ల ప్రగతి ఆ అనుమానాలను పటాపంచలు చేసిందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. దేశంలో ఈ స్థాయిలో న్యాయ వికేంద్రీకరణ జరగడం ఇదే మొదటిసారి అని ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వికేంద్రీకరణలో తెలంగాణ అడుగు వేసిందని అన్నారు. 13 జ్యుడిషియల్ యూనిట్ ఏకంగా 35 జ్యడీషియల్ యూనిట్లు గా మారనున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి న్యాయశాఖ అభివృద్ధి…