మాదిగల విశ్వరూప మహా సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప మహాసభ జరుగుతోంది. విశ్వరూప మహాసభకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ప్రధాని రాక నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణుల నినాదాలు మారుమ్రోగాయి. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చేరుకున్న ప్రధాని మోడీకి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రంలో దీపావళి పండగ వాతావరణం కంటే ఎన్నికల వాతావరణం వేడి వేడిగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి.
చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతంకు పీసీసీ నుంచి పిలుపు వచ్చింది. టికెట్ రాకపోవడంతో చేవెళ్ల రెబల్ అభ్యర్థిగా సున్నపు వసంతం నామినేషన్ వేసిన సంగతి విదితమే.
రాష్ట్రంలో పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో పింక్ వేవ్ తప్ప మరో వేవ్ లేనే లేదని ఆమె వ్యాఖ్యానించారు.
దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికి హాని చేయడని ఆయన అన్నారు. కొంత మంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి, బాగా తాగించి కత్తితో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. గంట లేట్ అయితే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు.
తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.
సంక్రాంతి రాగానే గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్టు సంగారెడ్డికి కొత్త వ్యక్తులు వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవేవో హామీలు ఇస్తారని.. మాయమాటలు నమ్మొద్దన్నారు. సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.