Bhatti Vikramarka: తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే అయ్యప్ప స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు భట్టి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా వైరాలో శబరి నగర్‌లోని అయ్యప్ప దేవాలయంలో కుటుంబ సమేతంగా భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు.
Also Read: Harish Rao: కొండగట్టుకు హరీశ్ రావు.. వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు
భట్టి విక్రమార్క స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. కృష్ణాజిల్లా నెమలి గ్రామంలో శ్రీకృష్ణ దేవాలయాన్ని భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి నేరుగా మధిరకు క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు మల్లు సూర్య విక్రమాధిత్య, వైరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందాస్ నాయక్, ఖమ్మం డీసీసీ అధ్యక్షులు వాళ్ళ దుర్గాప్రసాద్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేడు భారీ ర్యాలీతో నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు.