ఏపీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తెలంగాణలో మాదిగలను మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కర్ణాటక నుంచి వచ్చిన డబ్బు సంచులతో ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొన్నారు.
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అంబర్‌పేట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వీస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో పువ్వాడ ఓడిపోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భయంతో కార్పొరేటర్‌లపై దాడులు, బైండోవర్ కేసులు పెడుతున్నారన్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ, వైఎస్సార్‌టీపీ తప్పుకున్నాయి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చెప్పడంతో కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనై ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి అనుచరులతో చేరిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఓదెల జడ్పీటీసీ రాములు యాదవ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి హరీశ్ బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో లెక్క తేలింది. మూడు పార్టీలు కూడా బడుగుల ప్రతినిధి తామేనని చెప్పుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఏ పార్టీ ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లిందో తెలుసా?. ఎన్నికల్లో గెలవాలంటే ఏ ఒక్క వర్గమో ఓటేస్తే సరిపోదు. అందరి మద్దతు కావాల్సిందే. అందుకే అన్ని పార్టీలు కులాలను, వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
వేములవాడ రాజకీయాలు వేడెక్కాయి. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తులా ఉమకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వేములవాడ బరి నుంచి వికాస్ రావు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తుల ఉమ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజమంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వాపోయారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగ విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాటలు చెపుతున్నాయని.. మోడీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.