తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. కాగా ఇప్పటికే మొదటి దశ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఆ తరువాత పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. నేటితో రెండో విడత నామినేషన్ల గడువు ముగిసింది. రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లలో భాగంగా 4332 సర్పంచ్ స్థానాలకు…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా నేటితో (నవంబర్ 29) మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. తొలి రోజే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు సర్పంచి పదవుల కోసం 3,242 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల…
Telangana Local Body Elections 2025: నేడు తెలంగాణలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.. రెండు విడతల్లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నేటి నుంచి ఈనెల 11 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 15 వరకు గడువు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించనున్నారు. ఈనెల 23న మొదటి విడత…
తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందిస్తున్నానని సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గత పది సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టాల్సి ఉండేదన్నారు. ఆలస్యంగా నైనా ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పారన్నారు.
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంతా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరీంనగర్ విషయానికొస్తే ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీని 40 స్థానాల్లోపే పరిమిత చేసిన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మహిళలు పోటీ చేయగా.. చాలా నియోజకవర్గాల్లో మహిళలకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహారాణులెవరో తెలుసుకుందాం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్ ఆశలు ఆవిరైపోయాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్ ఓటింగ్ విధానం విజయవంతమైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడింది. గతంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయేవారు. ఈ హోమ్ ఓటింగ్ ద్వారా వారంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.