అంబర్‌పేట నియోజకవర్గంలో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారంలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా నేతలు ప్రణాళికలు రచించి బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ ప్రచారాల్లో జోరు పెంచారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్ పెళ్లి, చింతపల్లిగూడ, ఆదిభట్ల, బొంగులూరు, మంగళపల్లి, కొంగర కలాన్ గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గెలిస్తేనే ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములకు పట్టాల పంపిణీ జరిగిందన్నారు. మా హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందిందన్నారు.
రేపు విడుదల చేయబోయే మేనిఫెస్టోలో మరిన్ని కీలకాంశాలు ఉండబోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్లకు అనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణ ఆదాయం పెంపు.. పెరిగిన సంపద ద్వారా పేదలకు సంక్షేమం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి, బాలరాజుపై కాంగ్రెస్ దాడి చేయించిందా అని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్సే దాడి చేయించిందని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇస్తుందని అనుకుంటున్నామని ఆయన తెలిపారు.
ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారనే చూసే కాంగ్రెస్‌లో చేరానని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకున్నానని ఆయన తెలిపారు. నాకు స్వార్థం ఉంటే అధికార పార్టీలోనే ఉండే వాడినని ఆయన వెల్లడించారు.
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 నుండి రాచాలుర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి భేగంపేట్, గూడూరు, మాల గూడూరు, బేగరి కంచే, మీర్ఖన్ పేట్ ఆకుల మైలారం, పలు గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ర్యాలీగా పర్యటించారు.