119లో కేసీఆర్ ఒక్క ముదిరాజు బిడ్డకు కూడా టికెట్ ఇవ్వలేదంటే ఆయనకు వాళ్ల ఓట్లు అక్కర్లేదన్నట్టేనా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ ముదిరాజులకు 4 టికెట్లు ఇచ్చిందన్నారు. ముదిరాజులకు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించిందన్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోన్న బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసింది.
పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గద్వాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. ఈ ప్రాంతాన్ని కేసీఆర్ సంపూర్ణంగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం పార్టీ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఓటుకు నోటు అనేది ఒకటి ఇవ్వడం.. మరొకటి తీసుకోవడం అని ఎలక్షన్ కమిషనర్ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటుకు నగదు పంపిణీ ఎక్కువ సంఖ్యలో అనేది మా దృష్టికి వచ్చింది.. రాబోయే ఎన్నికల్లో పటిష్టమైన నిఘా పెడుతున్నామని ఆయన చెప్పారు.
ఇటీవల తెలంగాణలో బీజేపీలో అధిష్ఠానం భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కిషన్ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది.
తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఏర్పండి. బండల్స్ పంపిణీ లో గందరగోళం ఏర్పడటంతో.. సిబ్బంది మళ్ళీ బండల్స్ లెక్కపెట్టి టేబుల్స్ కు పంపిణీ చేస్తున్నారు. టేబుల్స్ కు పంపిణీ అయ్యాక కౌంటింగ్ ప్రారంభం అవుతుందని రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంకా అలా వెల్లడించారు. మొదటి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 2 వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.