Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బుధవారం బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. సిట్ చేపట్టిన దర్యాప్తులో 2023 నవంబర్ 15నుంచి ఈ ఇద్దరు ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. కేవలం ఎంపీల ఫోన్లు మాత్రమే కాకుండా, వారితో అనుబంధం ఉన్న ముఖ్య అనుచరులు, కుటుంబసభ్యుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది.
PEDDI : ‘పెద్ది’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ .. ఇండియన్ సినిమాకు న్యూ బెంచ్‌మార్క్?
అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు పోలీసులు. బీజేపీ నాయకుల రాజకీయ వ్యూహాలు, ముందస్తు ప్రచార కార్యాచరణ, ఆర్థిక వ్యవహారాలపై సంపూర్ణ సమాచారం తెలుసుకోవడమే లక్ష్యంగా ఫోన్లను ట్యాప్ చేశారని అధికారులు గుర్తించారు.
బీజేపీ నేతలకు ఆర్థిక సహాయం చేస్తున్న వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం మొత్తాన్ని ప్రభాకర్ రావు తన ముట్టడిలో ఉన్న ఓ వ్యక్తి, భుజంగరావుకు పంపించారని సమాచారం. భుజంగరావు ఆ డేటాను వాడుకుని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Off The Record: టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో సర్వే రిపోర్ట్ టెన్షన్..! వారికి నిద్రపట్టడం లేదా?