KTR : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మరోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులతో తనను లక్ష్యంగా చేసుకుని రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఆరోపించిన ఆయన, జైలుకు వెళ్ళేందుకు కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ వద్ద సోమవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ‘‘విచారణ పేరుతో ఆరు నెలలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏం తేల్చారు? నాకు ముందే తెలుసు.. ఫార్ములా ఈ-రేసు కేసులో అరెస్ట్ చేస్తారనే విషయాన్ని. అయినా నాకు భయం లేదు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జైలుకు వెళ్లడంలో ఎలాంటి భయం లేదు. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు జైలుకెళ్లాను. ఈ అంశాన్ని నాలుగు గోడల మధ్య విచారణకు పరిమితం చేయకుండా, అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు,” అని అన్నారు.
Ayesha Khan : చీరలో నాజూకైన ఒంపు సొంపులతో అదరగొడుతున్నఆయేషా ఖాన్
రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, ‘‘ప్రపంచానికి అభాసుపాలైన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోదగ్గ పని ఏదీ చేయలేకపోయింది. రైతుబంధును ఎలక్షన్ బంధుగా మార్చేశారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్. మేము చట్టాన్ని గౌరవిస్తాం. కావున ఏసీబీ పిలిస్తే 30 సార్లు అయినా విచారణకు హాజరవుతా,’’ అని తేల్చిచెప్పారు. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘‘42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికల బాట పట్టారు. బీసీలు అన్నీ గమనిస్తున్నారు. మేము వారి తరపున నిలబడి, ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వంను నిరంతరం నిలదీస్తూ ఉంటాం. జై తెలంగాణ’’ అంటూ నినాదాలు చేస్తూ ఏసీబీ కార్యాలయం వైపు బయలుదేరిన కేటీఆర్, లై డిటెక్టర్ టెస్టుకు కూడా తాను సిద్ధమేనని సవాలు విసిరారు.
Ponguleti Srinivas Reddy : తమ ప్రభుత్వంలో కక్ష సాదింపు చర్యలు ఉండవు