MLC Kavitha : బీసీ బిల్ కోసం జులై 17 న రైలు రోకో
- ఆపరేషన్ కగార్ ఆపివేసి పరిష్కారం చూపాలని కోరుతున్నాం
- సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లను వాడుకోవాలని మాత్రమే కేసీఆర్ అన్నారు
- చంద్ర బాబు తో రేవంత్ రెడ్డి కి ఉన్న లాలూచీ ఏమిటి : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆమె, ముఖ్యమంత్రి చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపి, సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. “బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు నష్టం జరగదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతుండగా, గోదావరి జలాలను తరలించేందుకు కేసీఆర్ అప్పుడు ఒప్పుకున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. కేసీఆర్ గోదావరి నీళ్లు సముద్రంలో వృథాగా పోకుండా వాడుకలోకి తేవాలని మాత్రమే అన్నాడు. కానీ, నదుల అనుసంధానం అంశానికి ఎప్పుడూ ఓకే చెప్పలేదు అని ఆమె వివరణ ఇచ్చారు.
Ye Maaya Chesave : ‘ఏ మాయ చేసావే’ ప్రమోషన్‌లో నేను లేను.. సమంత క్లారిటీ
Also Read
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- 12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ఏపీ కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని చెబుతున్నారు. అలా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? చంద్రబాబుతో రేవంత్‌కు ఉన్న లాలూచీ ఏమిటి? అని ప్రశ్నించారు. నల్లమల టైగర్ అంటూ కాదు, పని చేసి చూపించండి “రేవంత్ రెడ్డి నల్లమల టైగర్ అంటూ చెప్పుకుంటున్నారు. అది నిజమే అయితే బొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలి. లేదంటే, మీరు కేవలం పేపర్ పులి అని ప్రజలకు తేటతెల్లం అవుతుంది,” అంటూ సెటైర్లు వేశారు. “ఢిల్లీకి హాఫ్ సెంచరీ కొడుతున్నారు కానీ బీసీల కోసం అడగడంలేదు. బీసీ బిల్లు గురించి మోదీని అడగాలి,” అని స్పష్టం చేశారు.
బీసీలకు రాజకీయం హక్కులు లభించేలా కేంద్రం వెంటనే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ, జులై 17న రైలు రోకో నిర్వహిస్తామని ప్రకటించారు. ఢిల్లీకి వెళుతున్న సీఎం.. బీసీ బిల్లు పట్టుకుని తిరిగి హైదరాబాద్‌కు రావాలి అంటూ హెచ్చరించారు.
Jakkampudi Raja: ఎన్ని కుయుక్తులు పన్నినా.. జన ప్రవాహాన్ని అడ్డుకోలేరు!
తాజావార్తలు
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!