Ponguleti Srinivas Reddy : ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ విచారణ సాగుతుందని దానిలో ప్రభుత్వ ప్రమేయం ఏమి ఉండదని, విచారణ అనంతరం నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటున్నారు. మొన్న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వెళుతుండగా అంత హంగామాచేయడం అవసరమా.. తాజాగా కూడా కేటీఆర్ విచారణ ను ఏదో జరగబోతున్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా హంగామా చేస్తున్నట్లుగా దృష్టికి వచ్చిందని పొంగులేటి అంటున్నారు. విచారణ ల తరువాత నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని, తమ ప్రభుత్వానికి ఎప్పుడు కక్ష సాధింపు చర్యలు మాత్రం ఉండవని పొంగులేటి అన్నారు. స్థానిక ఎన్నికలు త్వరలోనే ఉంటాయని, బీసీ లరిజర్వేషన్ ల విషయంలో ప్రభుత్వం కట్టు బడి ఉందని , ఇప్పటకే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, అసెంబ్లీచేసిన బిల్లుకు అనుగుణంగానే రిజర్వేషన్ లను చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
Ayesha Khan : చీరలో నాజూకైన ఒంపు సొంపులతో అదరగొడుతున్నఆయేషా ఖాన్