CM Revanth Reddy: వరద నష్టంపై సచివాలయంలో కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం, అధికారులు వివరించారు.
Godavari River: నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి ఒక్కసారిగా పెరగటం ప్రారంభమైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.4 అడుగుల వద్ద ఉన్నది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తుంది.
TG Rain Alert: భారీ వర్షాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Nalgonda : నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేవరకొండలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం జరిగింది.
Hyderabad Crime: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి.. భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
అనధికార నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ గ్రేటర్ హైదరాబాద్ అధికారులు బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటి), ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన దామరచెరువు చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లో రెండు కళాశాలలు అక్రమంగా నిర్మించారనే ఆరోపణలున్నాయి. ఈ…