Hyderabad Metro: రాబోయే నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ పూర్తి?
- హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్.
- సిటీ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ.
- రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే మెట్రో రెండో దశ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది. సిటీ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ పెరగటంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు సంబంధించిన డీపీఆర్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే పనులు మొదలు పెట్టి రాబోయే నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు విజయవంతంగా సేవలందిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రూ.22,000 కోట్లతో నిర్మించారు.
Kiran Abbavaram : తమిళ్ లో మా సినిమాకు థియేటర్స్ ఇవ్వలేదు..
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
ప్రస్తుతం రోజుకు దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. రెండో దశ అందుబాటులోకి వస్తే సిటీలో రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తారు. మెట్రో రైల్ మొదటి దశ అమలైనప్పుడు హైదరాబాద్ దేశంలోనే ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో నిలిచింది. గత ప్రభుత్వం ఏడేండ్లుగా మెట్రో విస్తరణను పట్టించుకోలేదు. ఈలోపు మిగిలిన నగరాలన్నీ రెండో, మూడో దశ నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశాయి. గత ప్రభుత్వం నిర్వాకంతో ఒకప్పుడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు దేశంలో 9వ స్థానానికి పడిపోయింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా వంటి పెద్ద నగరాలతో పాటు, పూణే, నాగపూర్, అహ్మదాబాద్ చిన్న నగరాలు కూడా మెట్రో విస్తరణలో హైదరాబాద్ ని అధిగమించాయి.
Minister Ramprasad Reddy: కడప-హైదరాబాద్ ఇండిగో కనెక్టింగ్ విమాన సర్వీసును ప్రారంభించిన మంత్రి
గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఏడేండ్లు ఆలస్యం చేయటంతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచే కొత్త ప్రభుత్వం మెట్రో విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మార్గాలతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రెండవ దశలో అయిదు కారిడార్లలో 76.4 కిలో మీటర్ల మేరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబందించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పూర్తయింది. ఇందులో ప్రస్తుతం మూడు కారిడార్లు ఉన్నాయి. రెండో దశ లో ప్రతిపాదించిన కొత్త 5 కారిడార్ల వివరాలు చూస్తే..
* నాలుగో కారిడార్ నాగోల్– శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు (36.8 కి.మీ)
* అయిదో కారిడార్ రాయదుర్గ్–కోకాపేట్ నియోపొలిస్ వరకు (11.6 కి.మీ)
* ఆరో కారిడార్ ఎంజీబీఎస్–చంద్రాయన్ గుట్ట వరకు (7.5 కి.మీ)
* ఏడో కారిడార్ మియాపూర్–పటాన్చెరు వరకు (13.4 కి.మీ)
* ఎనిమిదో కారిడార్ ఎల్ బీ నగర్–హయత్ నగర్ వరకు (7.1 కి.మీ.)
ఈ మెట్రో రెండవ దశను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు పీపీపీ విధానంలో చేపడుతాయి. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.24269 కోట్లు. అందులో 30 శాతం అంటే రూ.7313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం అంటే రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. మిగతా 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకుంటాయి.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!