Mallu Bhatti Vikramarka: నేడు ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్, కలెక్టరేట్ సిబ్బంది భోజనశాల, లేడీస్ లాంజ్, స్త్రీ టీ క్యాంటీన్ లను ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని, ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలు గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఈ ఏడాది మహిళలకు వడ్డీ లేని రుణాలు 25 వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో మహిళలకు లక్ష కోట్ల రూపాయల రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని ఆయన అన్నారు.
Shobu Yarlagadda : బహుబలి ఫస్ట్ రోజు ప్లాప్ టాక్ విని చాలా బాధేసింది
మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడంతో పాటు వారు వ్యాపారాల్లో రాణించడానికి కావలసిన సంపూర్ణ సహకారం, ప్రోత్సాహకం ప్రభుత్వం అందిస్తుంది. ఆర్టీసీలో డ్వాక్రా సంఘాల మహిళలను భాగస్వామ్యం చేయడానికి ఆలోచన చేస్తున్నామని ఆయన అన్నారు. మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి.. ఆ బస్సులను ఆర్టీసీ సంస్థకు అద్దెకు ఇప్పించి, దాని ద్వారా వచ్చే లాభాలతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామని, వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకువచ్చి మహిళలను భాగస్వాములు చేయాలని ప్రణాళికలు తయారు చేయిస్తున్నామని, వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక ఉద్యమం లాగా అధికారులు ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు.
Gold Smuggling: ప్రైవేట్ పార్ట్‌లో కిలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన ఘనుడు
రాష్ట్రంలోని మహిళలను ప్రజా ప్రభుత్వం మహాలక్ష్మిలుగా కొలుస్తున్నదని, ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించే రవాణా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల ఆర్టీసీకి 400 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నదని ఆయన అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేసి ప్రభుత్వ బడుల నిర్వహణ బాధ్యత అప్పగించామని అన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదిక్కుకొని బలపడితే వారి కుటుంబం బలపడుతుందని ప్రజా ప్రభుత్వం భావిస్తున్నది అన్నారు.