Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, రికార్డులన్నీ తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను మార్చి 26న విడుదల చేస్తారని అందరూ భావించగా, మేకర్స్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు.
Also Read : Vrushakarma: హాలీవుడ్ రేంజ్‌లో ‘వృషకర్మ’ గ్లింప్స్..అదిరిపోయిన నాగచైతన్య మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్
Also Read
ఒక వారం ముందుగానే అంటే మార్చి 19, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివర్లో వచ్చే ఉగాది పండుగ సెలవులను క్యాష్ చేసుకోవాలని చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్, త్వరలోనే ట్రైలర్ అప్‌డేట్ కూడా ఇవ్వబోతున్నారు.
ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత 🔥🔥
Our USTAAD arrives a week early to spark Massive celebrations at the box office 💥#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 19th MARCH, 2026.#UBSOnMarch19th
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP… pic.twitter.com/G6AoBLqxVq
— Mythri Movie Makers (@MythriOfficial) March 5, 2026
తాజావార్తలు
-
Nepal: చైనాను కాదని, భారత్కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!