ప్రభుత్వ ఉద్యోగికి మాయమాటలు చెప్పి బంగారు ఉంగరంతో దొంగ బాబాలు పరారైన ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శంకర్ కుమార్, తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తక్కల్ల పల్లి, గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ దేంది మాధవరెడ్డి, నాగార్జున సాగర్ రోడ్డు తక్కల్లపల్లి గేటు వద్ద నుండి తమ గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ సమయంలోనే తెలుపు రంగు కారులో సాధువుల అవతారం ధరించిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన కవార్నాథ్ మధారి, (40) సావ్ నాథ్, (32) పర్దేశి నాథ్, (25) ప్రేమ్ నాథ్, (22) 4 వ్యక్తులు అతని వద్దకు వచ్చారు.
Edible oil Prices: పండగ పూట సామాన్యులపై భారం..పెరిగిన వంట నూనె ధరలు..
అయితే.. సేద తీరడానికి చుట్టుపక్కల దేవాలయాలు ఉన్నాయా అని మాటలు కలిపారు. మంత్రించి ఇచ్చిన రుద్రాక్షలు ధరిస్తే తిరుగు ఉండదని మంచి జరుగుతుందని రుద్రాక్ష మాల విభూది ఇచ్చి నమ్మించారు. చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తీసి ఇస్తే పూజలు చేసి ఇస్తామని దాన్ని తీసి ఇవ్వగానే దొంగ బాబాలు అర్థతులం బరువు ఉన్న బంగారు ఉంగరంతో ఉడాయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముమ్మర తనిఖీ చేపట్టగా మాల్ చెక్ పోస్ట్ వద్ద అనుమాదస్పదంగా కనిపించిన దొంగ బాబాలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Arvind Kejriwal: “బీజేపీ నన్ను చంపేందుకు ప్రయత్నించింది”.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు