IMD Weather: వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..
- తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం..
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి..
- ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది..
- కొన్నిచోట్ల ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం పలుచోట్ల వర్షం పడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD Weather: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నగరమంతటా పొడి వాతావరణం ఉంటుందని.. కొన్నిచోట్ల ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇతర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు నగర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. వర్షం సమయంలో బయటకు రావద్దని సూచించారు. నిన్న (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటలో 5.6 సెం.మీ. వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 5.6 సెం.మీ, కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో 5.3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
నో సైడ్ ఎఫెక్ట్స్.. చర్మసౌందర్యం ఇంట్లోనే ఇలా చేయండి..
Also Read
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
తాజావార్తలు
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!