Gravity Bomb: ఇరాన్‌కు యూఎస్ ‘‘గ్రావిటీ బాంబ్’’ వార్నింగ్.. అసలేంటీ ఈ బాంబు, ఎలా పనిచేస్తుంది.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gravity Bomb: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా ‘‘గ్రావిటీ బాంబు’’ ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. ఇటీవల యూఎస్ రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్ మాట్లాడుతూ.. “అమెరికా సైనిక చర్య ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయి. ఈ మిషన్ కోసం అమెరికా తన అపరిమిత నిల్వ అయిన ప్రెసిషన్ గ్రావిటీ బాంబులను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది” అని అన్నారు.
గ్రావిటీ బాంబు అంటే ఏమిటి.?
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ఇప్పటి వరకు సృష్టించిన అత్యంత ప్రమాదకరమైన ఆయుధాల్లో గ్రావిటీ బాంబు ఒకటి. ఈ రకమైన బాంబుల్ని విమానం నుంచి లాంచ్ చేస్తారు. వీటిని ఫ్రీ-ఫాల్ న్యూక్లియర్ బాంబులు అని కూడా పిలుస్తారు. విమానం నుంచి జారవిడిచిన తర్వాత ఇవి క్షిపణిలా కాకుండా, గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి, విమాన వేగంపై ఆధారపడి లక్ష్యాలను ఢీకొడుతాయి.
చాలా గ్రావిటీ బాంబులు ‘‘థర్మోన్యూక్లియర్’’. అంటే ఇవి చాలా పేలుడు శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కేంద్రం విచ్ఛత్తి( Nuclear Fission న్యూక్లియర్ ఫిషన్), కేంద్రక సంలీనం(Nuclear Fusion న్యూక్లియర్ ఫ్యూజన్) రెండింటిని కలిగి ఉంటుంది. విచ్ఛత్తిలో భారీ అణువులు ముక్కలై శక్తి శక్తి విడుదల అవుతుంది. సంలీనంలో చిన్న తేలికైన అణువులు కలిసి భారీ అణువుగా ఏర్పడుతాయి. దీని ద్వారా చాలా ఎక్కువ శక్తి విడుదల అవుతుంది. ఈ రెండు చర్యలు ఒకే బాంబులో ఉండటం వల్ల దీని శక్తి తీవ్రంగా ఉంటుంది.
ఎలా పనిచేస్తుంది..?
ఒక సాధారణ పేలుడు పదార్థం ఫిసైల్ మెటీరియల్(యురేనియం లేదా ఫ్లూటోనియం)ను బలంగా కుదిస్తుంది. దీంతో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ప్రారంభమవుతుంది. భారత వేడి, ఒత్తిడి ఉత్పత్తి అవుతుంది. విచ్ఛత్తి పేలుడు నుంచి వచ్చే శక్తి డ్యూటీరియం, ట్రిటియం వంటి ఐసోటోపులు ఉన్న సెకండరీ స్టేజ్‌ను బలంగా ప్రేరేపిస్తుంది. దీనివల్ల న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రారంభం అవుతుంది. విచ్ఛత్తి ద్వారా విడుదలయ్యే శక్తి కన్నా సంలీన చర్య వల్ల ఎక్కువ శక్తి విడుదల అవుతుంది. కొన్ని ఆధునిక గ్రావిటీ బాంబుల్లో “డయల్-ఎ-యీల్డ్” అనే సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా ఫ్యూషన్ స్టేజ్‌లో ఎంత భాగం పనిచేయాలో మార్చి, బాంబు శక్తిని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు.
తాజావార్తలు
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!