నేడు, రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసి ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకోనున్న సీఎం
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పార్టీ సమావేశం.. అందుబాటులో ఉన్న నేతలతో వైఎస్ జగన్ సమావేశం
నేడు జైలు నుంచి విడుదల కానున్న వల్లభనేని వంశీ.. 138 రోజులుగా జైల్లో ఉన్న వంశీ.. 11 కేసుల్లో వంశీకి బెయిల్.. చివరి కేసులో నిన్న బెయిల్ ఇచ్చిన నూజివీడు కోర్టు
లిక్కర్ స్కాం కేసులో నేడు రెండో రోజున చెవిరెడ్డిని కస్టడీకి తీసుకోనున్న సిట్.. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడును కూడా విచారించనున్న పోలీసులు
నేడు బాపట్లలో వైసీపీ జిల్లా కార్యాలయంలో సమావేశం.. పాల్గొనున్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జులు
కావలిలో వంగవీటి రంగా కాంస్య విగ్రహ ఏర్పాటు.. హాజరుకానున్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, వంగవీటి రాధ
నేడు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామంలో జరిగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.. డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
నేటి నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన రాకపోకలు ప్రారంభం.. విజయవాడ విమానాశ్రయం నుండి 3.45కు బయలుదేరి కర్నూల్ ఎయిర్‌పోర్ట్‌కి 4.50 గంటలకు చేరుకొనున్న ఇండిగో విమానం మొదటి సర్వీస్
నేడు జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన కాకినాడ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం.. పాల్గొనున్న ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం జయపురం గ్రామంలో నిర్వహించనున్న “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్
వరంగల్ భద్రకాళి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న శాకంబరి నవరాత్రి మహోత్సవాలు.. నేటితో 7వ రోజుకు చేరిన భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంభరీనవరాత్రి మహోత్సవాలు.. ఉదయం ఉగ్రాక్రమం, సాయంత్రం శివదూతీక్రమం అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు
నల్గొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్.. హాజరుకానున్న ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా అధికారులు
మూడో రోజు సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. రెండు రోజులుగా సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతున్న వర్షం.. ఇప్పటివరకు 40కి పైగా కార్మికులు మృతి, మరికొందరి ఆచూకీ గల్లంతు
నేటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన.. నేటి నుంచి జూలై 9 వరకు విదేశీ పర్యటనకు ప్రధానమంత్రి మోడీ.. ఇవాళ, రేపు ఘనాలో పర్యటన
నేటి నుంచే ఇంగ్లండ్, భారత్ రెండో టెస్టు ఆరంభం.. ఎడ్జ్‌బాస్టన్‌లో మధ్యాహ్నం 3.30 నుంచి మ్యాచ్ ప్రారంభం