Khammam: దారి తప్పిన ఎస్సై.. భార్యను వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య..!
- 8 ఏళ్ల క్రితం రాజేశ్వరితో పెళ్లి
- ఇద్దరికీ ఓ కుమారుడు, కూమార్తె
- కట్టుకున్న భార్యకు సైతం రోజూ వేధింపులు
- తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయినా ఆగని వేధింపులు
- 2 రోజుల క్రితం పురుగుల మందు తాగిన రాజేశ్వరి
- ఆమె వద్ద స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు
- రాణా ప్రతాప్‌పై నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉన్న ఆ ఎస్సై దారి తప్పాడు. తన వద్దకు వచ్చే వారికి మంచి చెడు చెప్పాల్సిన వృత్తిలో ఉండి తన వంకర బుద్ధి బయట పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్యపైనే నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వేధింపులు తాళలేక ఆమె ఉసురు తీసుకుంది. ఖమ్మంలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఫొటోలో ఉన్న ఇతని పేరు రాణా ప్రతాప్. ఖమ్మంలోని రైల్వే విభాగంలో ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇతనికి 8 ఏళ్ల క్రితం రాజేశ్వరితో పెళ్లి జరిగింది. ఇద్దరికీ ఓ కుమారుడు, కూమార్తె ఉన్నారు..
READ MORE: Crime News: ఇద్దరు పిల్లలతో సహా భార్యను కోర్టుకు తీసుకెళ్లిన భర్త.. చివరికి..?
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఇంత వరకు బాగానే ఉంది. కానీ పోలీసు కుటుంబ నేపథ్యం ఉండి… ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ దారి తప్పాడు. ఖమ్మంలో ట్రెయినీ ఎస్సైగా ఉన్నప్పడే గన్‌తో పలువురు చిరు వ్యాపారులను బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు కట్టుకున్న భార్యను సైతం రోజూ వేధిస్తున్నాడు. దీంతో కొంత కాలం నుంచి భార్య రాజేశ్వరి దూరంగా ఉంటోంది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయినా.. రాజేశ్వరికి వేధింపులు తప్పలేదు. భర్త, అత్త, మామ వేధించడంతో వాటిని భరించలేక 2 రోజుల క్రితం పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 2 రోజులపాటు చికిత్స పొందుతూ మృతి చెందింది..
ఐతే అంతకుముందే పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజేశ్వరి బంధువులు. దీంతో ఎస్సై రాణా ప్రతాప్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమె వద్ద స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఉన్నతాధికారులు రాణా ప్రతాప్‌పై నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అటు రాణా ప్రతాప్‌పై రాజేశ్వరి బంధువులు దాడి చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు. పోలీసుగా విధులు నిర్వహిస్తూ.. నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి.. ఏకంగా తన భార్యనే వేధించాడు. అతనికి తల్లిదండ్రులతోపాటు తమ్ముడు ఎస్సై మహేష్ కూడా తోడయ్యాడు. దీంతో కుటుంబం మొత్తం వేధించడాన్ని తట్టుకోలేని రాజేశ్వరి.. తనువు చాలించింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి లేకుండా పోయింది..
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!