Pashamylaram : సిగాచి పరిశ్రమ ఘటనలో 37కు చేరిన మృతుల సంఖ్య
- సిగాచి పరిశ్రమ ఘటనలో 33కు చేరిన మృతుల సంఖ్య
- ఇవాళ మరో ఏడు మృతదేహాలు వెలికితీత
- సిగాచి ఫార్మా కంపెనీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- భవనం శిథిలాలను తొలగిస్తున్న SDRF, NDRF బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pashamylaram : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో నిన్న జరిగిన ఘోర రసాయన ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. సిగాచి ఇండస్ట్రీస్‌కి చెందిన ఈ రసాయన కర్మాగారంలో సంభవించిన పేలుడు, మంటల వల్ల ఇప్పటివరకు 37 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరెన్నో శవాలు ఇప్పటికీ గుర్తుతెలియని స్థితిలో ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాద సమయంలో వర్షం పడుతున్నా కూడా సహాయక చర్యలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖతో కలిసి సహాయక బృందాలు మృతదేహాల వెలికితీతకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రకటన వెలువడింది.
Also Read
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
Khammam: దారి తప్పిన ఎస్సై.. భార్యను వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య..!
ఇదిలా ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 9 గంటలకు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించనున్నారు. గాయపడిన బాధితులను పరామర్శించి, పరిస్థితిపై సమగ్ర నివేదిక తీసుకోనున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం సంఘటన స్థలాన్ని పూర్తిగా ముట్టడి చేసిన అధికారులు విషపూరిత వాయువుల వాసన లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పక్క పక్కన ఉన్న ఇతర పరిశ్రమలను కూడా తాత్కాలికంగా మూసివేశారు. పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. పరిశ్రమల భద్రత ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
Crime News: ఇద్దరు పిల్లలతో సహా భార్యను కోర్టుకు తీసుకెళ్లిన భర్త.. చివరికి..?
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!