Suicide : “నీ కొడుకు తలరాత ఇలానే రాస్తావా.?” సూసైడ్ నోట్‌లో దేవుడిపై యువకుడు
- నీ కొడుకైతే వానికి ఇలానే తలరాత రాస్తావా?"
- సూసైడ్ నోట్ లో భగవంతుడిని ప్రశ్నించిన యువకుడు
- నా శరీరాన్ని కాశీలో దహనం చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముదిరాజ్ వీధికి చెందిన దీటి రోహిత్ (23) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు రోహిత్ ఓ సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. అందులో అతను వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు, విఫలమైన ఆశల గురించి విచారం వ్యక్తం చేశాడు. “నీ కొడుకు అయితే వాని తలరాత ఇలానే రాస్తావా?” అంటూ భగవంతుడిని ప్రశ్నిస్తూ వ్రాసిన వాక్యం, నోటులోని కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ మాటలు అతని జీవితంలోని నొప్పిని, అసహనాన్ని చాటిచెప్పుతున్నాయి.
“నా కలలు కూలిపోయాయి…” అని.. ఆత్మహత్యా లేఖలో రోహిత్ ఇలా పేర్కొన్నాడు.. “My dream of writing the best suicide letter has come true by God’s grace, but living my dreams, of what I thought, had collapsed.” అంటే, జీవితం పట్ల గల ఆశలు తారుమారైనట్టు తాను చెబుతున్నాడు. తాను పలు ప్రయత్నాలు చేసినా జీవితం విజయవంతంగా సాగలేదని, జీవించడానికంటే చనిపోవడమే తక్కువ నొప్పిగా అనిపిస్తోందని రాసుకున్నాడు.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
EXCLUSIVE : హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. టైటిల్ ఇదే..
సూసైడ్ నోట్ చివర్లో తన తుది కోరికను కూడా వ్యక్తం చేశాడు. “My last wish is to burn my physical body in ghats of Kashi” అని రాసి, తన మృతదేహాన్ని వారణాసి (కాశీ) ఘాట్‌లలో దహనం చేయాలని కోరుకున్నాడు. ఈ వాక్యం అతని ఆధ్యాత్మికత, అంతిమ శరణాగతి పట్ల ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. ఇక.. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ప్రాథమికంగా ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నప్పటికీ, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వేములవాడలోని యువతలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఒక విద్యావంతుడు యువకుడు ఈ స్థాయిలో మానసికంగా విసిగిపోవడం చర్చనీయాంశమైంది. మానసిక ఆరోగ్యంపై సమాజం ఇంకా స్పష్టమైన చైతన్యం కలిగి ఉండాలన్న అవసరం స్పష్టమవుతోంది.
Xiaomi YU7 SUV: 3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్‌లు.. ఆటో మార్కెట్‌లో సంచలనం
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!