HYDRA : రాజేంద్రనగర్‌లో హైడ్రా కూల్చివేతలు.. పార్క్ స్థలాన్ని కబ్జా చేశారంటూ వివాదం
- నలందా వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు అనంతరం హైడ్రా చర్య
- అక్రమ నిర్మాణాలపై జేసీబీలతో హైడ్రా దాడి
- స్థానికుల నిరసనలు.. పట్టాదారుల ఆధారాల వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Authority) కదంతొక్కింది. హైదర్ గూడ గ్రామం, సర్వే నంబర్ 16లోని 1000 గజాల పరిమాణంలో ఉన్న పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగారు. నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హైడ్రాకు అందిన ఫిర్యాదులో, హైదర్ గూడలోని పార్క్‌కు కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేపట్టారని తెలిపారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తుతో JCBలతో సైట్లోకి చేరుకున్నారు.
Floods: నేపాల్-చైనా బోర్డర్‌లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన పోలీసులు, 200 వాహనాలు
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
కూల్చివేతల ప్రక్రియ మొదలైన వెంటనే స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీలను అడ్డుకుంటూ కొందరు మహిళలు నేరుగా వాహనాల ముందు పడుకొని నిరసన వ్యక్తం చేశారు. తమ వద్ద ప్రభుత్వంగా జారీ అయిన పట్టాలు ఉన్నాయని, ఆ భూముల్లో తామే అసలు యజమానులమని బాధితులు వాదించారు. అయితే హైడ్రా అధికారులు మాత్రం, సర్వే నంబర్ 16లో ఉన్న భూమి పార్క్‌కు కేటాయించబడిందని, అందులో ప్రహరీ నిర్మాణం అక్రమమని పేర్కొన్నారు. వాస్తవిక పరిశీలన అనంతరం ఆ నిర్మాణాన్ని కూల్చేశారు.
అయితే, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భవన కూల్చివేతలు జరపడం అన్యాయమని పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద పరిస్థితుల దృష్ట్యా, పోలీసులు సంఘటనా స్థలానికి భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నా, పట్టాదారులు న్యాయపరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Bathukamma Kunta : బతుకమ్మ కుంట బతికింది.. ఎంత బాగుందో ఇప్పుడు..
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!