బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు:
బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వందేళ్ల నుంచి గోదావరిలో ఏటా సగటున 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. వృథా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు అని తెలిపారు. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, ఇకపై కూడా చెప్పను అని చెప్పారు. సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.
‘తల్లికి వందనం’ రెండో విడత నగదు విడుదలకు డేట్ ఫిక్స్:
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. జులై 10న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారు ఈ విడతలో లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందారు.
లేట్ ఫీజు పేరిట దోపిడి:
నేటి రోజుల్లో విద్య చాలా కాస్ట్లీ అయిపోయింది. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు లక్షల రూపాయల ఫీజులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని తల్లిదండ్రులు కాయాకష్టం చేస్తూ ఫీజులు చెల్లిస్తున్నారు. అయితే కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూనే.. లేట్ ఫీజుల పేరిట దోపిడికి పాల్పడుతున్నారు. రెండు రోజులు ఫీజు కట్టడం లేట్ అయ్యిందని రూ. 3 వేలు పెనాల్టీ వసూలు చేసింది అవినాష్ కళాశాల. దీంతో విసిగిపోయిన ఆ విద్యార్థి తండ్రి మీడియా ముందు తన గోడును వెల్లబోసుకున్నాడు.
బీసీ బిల్లు కోసం బీఆర్ఎస్ బరాబర్ కొట్లాడుతది:
42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టరూపం తీసుకురావాలని.. అప్పటి వరకు బీసీ బిల్లు కోసం బీఆర్ఎస్ బరాబర్ కొట్లాడుతదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కవిత మాట్లాడుతూ.. బీసీ బిల్లు తీసుకు రావాలని కేంద్రం పై ఒత్తిడి తెస్తున్నాం.. అందుకోసం జులై 17 న రైలు రోకో చేయబోతున్నాం.. రైలు రోకోకు మద్దతు ఇవ్వమని కొన్ని పార్టీ లను కలిశాం.. బీజేపీ బీసీ బిల్ పెట్టె విదంగా చేయాలని కొత్తగా ఎన్నికైన రామచందర్ రావు కు లేఖ రాశాము.. ఈ రోజు కాంగ్రెస్ అద్యక్షుడు ఖర్గే హైదరాబాద్ వస్తున్నారు.. ఖర్గే కు లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.. కేంద్రం పై ఒత్తిడి తేవాలని ఖర్గే ను కోరుతున్నాం.. ప్రభుత్వం కులగణన చేసిన వివరాలు బయట పెట్టమని డిమాండ్ చేస్తున్నామన తెలిపారు.
ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణం:
దేశ వ్యాప్తంగా ఈ మధ్య హఠాత్తు మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి కోవిడ్ వ్యాక్సినే కారణమంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. యువకులే ఎక్కువగా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. దీంతో ప్రచారం మరింత వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా కర్ణాటకలోని హసన్ జిల్లాలో గత నెలలో గుండెపోటుతో 20 మంది చనిపోయారు. దీనికి కోవిడ్ వ్యాక్సిన్లే కారణమంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. తాజాగా బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. హసన్ జిల్లాలో జరిగిన మరణాలు కోవిడ్ టీకాల ప్రభావం కాదని తేల్చి చెప్పారు.
కీలకంగా వ్యవహరిస్తున్న డ్రోన్లు:
యుద్ధం స్వరూపం మారిపోతోంది. సైనికులు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాల స్థానాన్ని డ్రోన్లు ఆక్రమిస్తున్నాయి. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ శత్రువుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాలు అత్యధిక సంఖ్యలో డ్రోన్లను వినియోగించాయి. ఇజ్రాయిల్ పైన హమాస్ మెరుపు దాడి సమయంలోనూ డ్రోన్లే కీలకంగా వ్యవహరించాయి. ఇక, ఇజ్రాయిల్ పై పలుసార్లు డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. ఆపరేషన్ సింధూర్లోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి.
ట్రంప్‌పై న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మమ్దానీ ఘాటు వ్యాఖ్యలు:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్.. మమ్దానీపై తీవ్రంగా స్పందించారు. తాజాగా మమ్దానీ రియాక్ట్ అయ్యారు. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత ముస్లిం సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు. ప్రైమరీ ఎన్నికల్లో గెలుపొందారు. ఫైనల్ ఎన్నికల్లో గెలిస్తే న్యూయార్క్ మేయర్‌గా తొలి ముస్లిం వ్యక్తిగా మమ్దానీ రికార్డ్ సృష్టించనున్నాడు.
భారత్-యూఎస్ మధ్య కీలక డీల్ జరిగే ఛాన్స్:
భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 48 గంటల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరిగాయి. అంతేకాకుండా భారత్‌తో భారీ ఒప్పందం జరగబోతుందని ఇప్పటికే ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఇక సుంకాలపై ట్రంప్ విధించిన తాత్కాలిక వాయిదా గడువు జూలై 9తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరకొన్ని గంటల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద ప్రకటన రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
రెండో టెస్టులోనే.. ‘కింగ్’ కోహ్లీ రికార్డు సమం:
సెంచరీతో శుభ్‌మన్ గిల్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత కెప్టెన్‌గా సెంచరీ చేసిన రెండవ సారథిగా గిల్ నిలిచాడు. గతంలో కింగ్ కోహ్లీ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. 2018లో ఎడ్జ్‌బాస్టన్‌లో కెప్టెన్‌గా కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇప్పుడు గిల్ సెంచరీ బాదాడు. 2015లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కోహ్లీ.. 2018లో సెంచరీ చేశాడు. గిల్ మాత్రం సారథిగా ఆడిన రెండో టెస్టులోనే శతకం బాదాడు. ఇక గిల్ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మొత్తంగా 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా కూడా 41 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో రోజులు ఈ ఇద్దరు నిలిస్తే.. భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయం.
‘మైసా’ టైటిల్ అంటే అర్థం ఏంటో:
రష్మిక తాజాగా నటించబోతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మైసా (Mysaa)’ . కాగా ప్రాజెక్టు నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రక్తంతో ముఖం, చేతిలో ఆయుధం, ముక్కుపుడకతో ఆమె లుక్ చూసిన అంతా షాక్ అయ్యారు. ‘ధైర్యం ఆమె బలం..ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి..’ అంటూ ఇచ్చిన హైప్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక..‘మైసా’ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే అందరిలోనూ ఓ ఆసక్తి నెలకొంది. అసలు మైసా అంటే ఏంటి?. రష్మిక లుక్‌కు ఈ పేరుకు సంబంధం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. అయితే ‘మైసా’ అనే పదం వివిధ భాషల మూలాల నుంచి తీసుకున్నారు. స్వీడిష్, అరబిక్, జపనీస్, జార్జియన్ భాషల్లో ‘మైసా’ అనే పదానికి ‘తల్లి’ (Mother) అని అర్థం. స్వేచ్ఛా భావాలతో, సహజ నాయకత్వంలో ముందుకు సాగిన ఓ సాహసవంతురాలి పాత్రకు ఇది సరైన టైటిల్ అని మేకర్స్ చెబుతున్నారు.
‘రామాయణ’ ఫస్ట్ లుక్ రిలీజ్:
రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇక ఈ కథలో కీలకమైన రావణాసురిడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నాడు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతోంది. కానీ ఈ సినిమాకు సంబంధించి కనీసం ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. రణబీర్ రాముడు పాత్రలో నటిస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇన్ని రోజులు ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఎదుచూసిన మేకర్స్ చిన్న పాటి గ్లిమ్స్ తో వీడియో రిలీజ్ చేసారు. ఎవరెవరు ఏ ఏ పాత్రలు పోషిస్తున్నారో తెలియాజేస్తూ చివరిలో యష్ ను లుక్ ను చూపిస్తూ ఎండ్ లో రాముడుగా రణబీర్ ఎంట్రీ ఫ్రెమ్ ఓ రేంజ్ లో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే రామయణ ఇంట్రడక్షన్ ఊహించిన దానికి మించి ఉండబోతుందని తెలుస్తోంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ టాప్ క్లాస్ ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ‘ రామాయణ’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. సెకాండ్ పార్ట్ ను 2027 దీపావళికానుకగా రిలీజ్ చేస్తామని తెలిపారు.