ఆయన సినిమాలో నటించేందుకు బాలీవుడ్ హీరోల రిక్వెస్ట్
సౌత్ హీరోలు నార్త్‌లో సిసినిమాలు చేయాలనుకోవం కామన్. కానీ నౌ జస్ట్ ఫర్ ఛేంజ్ ముంబయి స్టార్ హీరోలు దక్షిణాది చిత్రాల్లో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సల్మాన్, అమితాబ్, సైఫ్, అక్షయ్, అజయ్ దేవగన్ స్టార్స్ టాలీవుడ్ తెరంగేట్రం జరిపోయింది. కానీ వీరంతా వివిధ స్టార్స్‌తో వర్క్ చేశారు. కానీ కేవలం ఒక్క రజనీకాంత్ కోసం నార్త్ స్టార్ హీరోలు క్యూ కట్టడమంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు బాలీవుడ్‌లో సౌత్ హీరోలు పెద్దగా క్లిక్ అవ్వని టైంలో తన మార్క్ క్రియేట్ చేసి తనకంటూ ఓన్ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు రజనీ. ప్రజెంట్ కోలీవుడ్ డబ్బింగ్ చిత్రాలతోనే హిందీ ఆడియన్స్‌ను పలకరిస్తున్నారు.
బస్టాండ్‌లో ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్..! నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ అఘాయిత్యం
ప్రతీ నిత్యం ఏదో ఒక దగ్గర చిన్నారులు, బాలికలు, అమ్మాయిలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. ఓవైపు కఠినశిక్షలు పడుతున్నా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు.. తాజాగా, కర్నూలు జిల్లాలో ఇంటర్ చదువుతోన్న బాలికను కిడ్నాప్ చేసి.. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆటో డ్రైవర్.. ఆదోనీలో 16 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పత్తికొండ గురుకుల స్కూల్ లో ఇంటర్ చదువుతున్న బాలిక.. వైద్యం నిమిత్తం తన తల్లితోపాటు సొంతూరు నుంచి ఎమ్మిగనూరుకు వచ్చింది.. అయితే, పొరపాటున ఆదోనీ బస్సు ఎక్కిందట బాలిక.. ఇక, చేసేది ఏమీ లేక .. ఎమ్మిగనూరు బస్సు కోసం ఆదోనీ బస్టాండ్ లో ఎదురు చూస్తుండగా కన్నేసిన ఆటో డ్రైవర్ రమేష్… బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు.. నిర్మానుష్య ప్రదేశానికెళ్లి.. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. బాలకపై పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుండగా.. అర్ధరాత్రిసమయంలో ఆదోనీలోని బాలికల హాస్టల్ దగ్గర వదిలేశాడు.. ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఆటో డ్రైవర్ రమేష్ పై ఫోక్సో కేసు నమోదు.. అరెస్ట్ చేశారు..
జగన్‌ను చూస్తేనే కూటమి నేతలకు భయం.. అందుకే అడ్డుకునే ప్రయత్నం..!
వైఎస్ జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం, అందుకే రైతుల వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి.. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు.. రైతుల కోసం బంగారుపాల్యం గ్రామనికి వస్తున్నారు.. అప్పుడే కూటమి నాయకులు రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు.. జగన్‌ను చూస్తే కూటమి నాయకుల భయం అన్నారు.. మరోపక్క వైసీపీ నాయకులను భయపెడుతున్నారు.. జనసేన, టీడీపీ వారు జగన్ పర్యటన రద్దు అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. జగన్ రావడం ఖాయం.. రైతులు కలవడం పక్కా అని స్పష్టం చేశారు..
దారుణం.. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తని హత్య చేసిన భార్య..
ఈ మధ్య ప్రియుడి కోసం భార్యలు భర్తలను కృరంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగు చూస్తేనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. తాగిన మత్తులో ఉన్న భర్త ఛాతిపై కూర్చొని గొంతు నులిమి కిరాతకంగా చంపింది. కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా(మండలం) కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప(32)కు ధన్వాడ మండలం రాంకిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన రాధతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లోని బాచుపల్లికి వచ్చారు. ఇక్కడే కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో రాధ ధన్వాడకు చెందిన ఓ యువకుడితో వివాహేతర బంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త అంజిలప్పకు తెలిసింది. దీంతో ఆ యువకుడితో మాట్లాడొద్దని అంజిలప్ప రాధను మందలించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భార్య ప్లాన్ వేసింది. గత నెల 23న తాగిన మత్తులో ఉన్న భర్త అంజిలప్ప పడుకుని ఉండగా.. గొంతు నులిమి హత్య చేసింది.
ఠాక్రేలను కలపడానికి, బాలాసాహెబ్ చేయలేనిది ఫడ్నవీస్ చేశారు..
20 ఏళ్లుగా శత్రువుగా ఉన్న బంధవులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికను పంచుకుంటూ, తాము కలిసిపోయినట్లు ప్రకటించారు. శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుల కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బాల్ ఠాక్రే కూడా చేయలేని పనిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని రాజ్ ఠాక్రే అన్నారు. వివాదాస్పద త్రిభాష సూత్రంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, మరాఠీ ప్రజలపై హిందీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వీరిద్దరిని, హిందీ వ్యతిరేకత కలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని ఫడ్నవీస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
బాబు షూరిటీ ఎక్కడ ఉందని ప్రజలు అడుగుతున్నారు..
రాజమండ్రిలో జరిగిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ తో పాటు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. రీ కాలింగ్ చంద్రబాబూస్ మానిఫెస్టో అని జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటికి వెళ్లి అధికార పార్టీ అమలు చేయని హామీల గురించి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. బాబు షూరిటీ ఏదని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సింగయ్య అనే వ్యక్తి చనిపోతే.. ఏఐ వీడియో రూపొందించి జగన్ కారు కింద పడినట్లు అధికార పార్టీ నేతలు చూపించారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై ఏదో రకంగా కేసులు పెట్టీ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని అన్నారు. బులెట్ ప్రూఫ్ కారు మెడ ఎక్కితే అసలు మెడే ఉండదని వివరించారు.. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో రెచ్చి పోయి.. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని మార్గాని భరత్ విమర్శించారు.
13 నెలలు గడిచినా.. చంద్రబాబు, పవన్ హామీల అమలెప్పటికి..?
పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, రీజనల్ కో-ఆర్డినేటర్ కురుసాల కన్నబాబుతో పాటు అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు పాముల పుష్పా శ్రీవాణి, పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో రెండు పక్షాలు ఉంటాయి.. ఒకటి అధికార పక్షం, రెండొది ప్రతి పక్షం.. ప్రతిపక్షం బాధ్యత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గొంతుగా నిలవడం.. ఇచ్చిన హామీలపై నిలదీయడమే మా బాధ్యత.. అమలు కానీ హామీలపై అడిగితే కేసులు పెట్టడం, నలకమందం అనడం సంప్రదాయం కాదు అని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
జగన్ ప్రతిపక్ష నేత కాదు.. ఒక పార్టీకి అధినేత, ఓ ఎమ్మెల్యే మాత్రమే..
80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకులో CNG గ్యాస్ ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పుకొచ్చారు. గత ఐదు సంవత్సరాలు రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నించే అధికారం లేకుండే.. గతంలో ప్రజలను అందరినీ హౌస్ అరెస్టులు చేశారు.. కానీ, ప్రభుత్వం కూటమి ప్రభుత్వ హయంలో అలాంటి పరిస్థితి లేదు.. స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలను సర్కార్ కి చెప్పుకునే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని మంత్రి అచ్చెన్న వెల్లడించారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క
మంత్రి సీతక్క ప్రజా భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు కేటీఆర్ స్పందించిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు కేటీఆర్ కు అర్దం కానట్లు ఉందని, విదేశాలలో ఉన్న కేటీఆర్ తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉందన్నారు. కేటీఆర్ గుర్తింపు సమస్యతో బాధపడుతున్నాడని, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లో చర్చిద్దాం రా అంటే…ప్రెస్ క్లబ్ కు రమ్మనడం ఏంటి అని మంత్రి సీతక్క సెటైర్ వేశారు. ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది ప్రెస్క్లబ్ లో చర్చించడానికి కాదని, అసెంబ్లీలో చర్చించ మంటే.. ప్రెస్ క్లబ్ కు రావాలని కోరడం ఏంటి అని ఆమె అన్నారు.
కేటీఆర్, హరీష్ రావు సెకండ్ బెంచ్ లీడర్స్
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు, చురకలతో మార్మోగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చ జరగాలన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపుపై స్పందిస్తూ, బీఆర్ఎస్ నేతలు చర్చకు భయపడుతున్నారని, అసెంబ్లీని తప్పించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. “తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని అసెంబ్లీ పెడతావా? చర్చించేది ఉంది అంటూ కోరుతుంటే, ఇక్కడ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ పెడతా, ప్రతిపక్ష నాయకుడు రావాలి అంటున్నాడు,” అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.