ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు.. సమాజానికి అందించే బాధ్యత! ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి అందించే ఓ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మానవ వనరులు అత్యంత బలమైన పెట్టుబడి అని, మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. గతేడాది అభయ హస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్ అయ్యారని, 178 మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది…
MLC Kavitha : జగిత్యాలలో జరిగిన దారుణ ఘటనపై తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో గోడు చెప్పుకోవడానికి వచ్చిన ఓ దివ్యాంగుడిని, కలెక్టర్ ఎదుటే కానిస్టేబుల్ ఈడ్చి, అతని వీల్‌చైర్ నుంచి కింద పడేసి లాక్కెళ్లిన ఘటనపై ఆమె స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎమ్మెల్సీ కవిత ఈ సంఘటనను “ప్రజాపాలన అంటే ఇదేనా?” అని ప్రశ్నిస్తూ, దీనిని అత్యంత దుర్మార్గమైన చర్యగా ఖండించారు. బాధ్యుడైన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు…
కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదు..? కవిత సమాధానం ఇదే.. కేటీఆర్‌తో గ్యాప్‌పై మాట్లాడటానికి కవిత ఇష్టపడలేదు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పైనే ఫోకస్ ఎందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి మరోమాట మాట్లాడుతారన్నారు. బండి సంజయ్ కు ఈటల వార్నింగ్ ఇచ్చినా.. చర్చ లేదన్నారు. బీఆర్ఎస్ గురించే ఎందుకు చర్చ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అనంతరం సింగరేణిపై…
CM Revanth Reddy : హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా ముంపు ప్రాంతాలను పర్యటించారు. మైత్రివనం, బల్కంపేట్, అమీర్‌పేట్ ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా అమీర్‌పేట్‌లోని గంగుబాయి బస్తీ, బల్కంపేట్‌లోని ముంపు ప్రభావిత కాలనీల్లో ప్రజల పరిస్థితి, నష్టాలను పరిశీలించారు. ముంపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో సీఎం మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ మరియు సంబంధిత అధికారులను వెంటబెట్టుకొని పర్యటించిన…
Raksha Bandhan : రక్షా పౌర్ణమి సందర్భంగా రామాయంపేట బస్ స్టేషన్లో జరిగిన ఒక హృదయాన్ని హత్తుకునే సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామారెడ్డి బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జి ఎస్ నారాయణ తన షెడ్యూల్ ప్రకారం ప్రయాణం చేస్తున్నపుడు రామాయంపేట వద్ద కొద్ది సేపు ఆగిన సందర్భంలో, అతని సోదరి శారద అక్కడికి వచ్చి తన సోదరుడికి రాఖీ కట్టింది. రక్షాబంధన్ పండుగ సమయంలో సెలవు తీసుకోకుండా విధులు నిర్వరిస్తున్న నారాయణ తన…
CM Revanth Reddy : వర్షాలు పడిన ప్రతీసారీ హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న నీటి చేరిక, ట్రాఫిక్ జాం, లోతట్టు ప్రాంతాల్లో వరద వంటి సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్‌గా స్పందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల తరువాత నగరంలో ఏర్పడిన అతలాకుతల పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర చర్చ జరిపారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిలిచిపోవడం, ట్రాఫిక్‌కు అంతరాయం…
కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. వచ్చే వారం ప్రధాన మంత్రితో సమావేశం అవనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల మంజూరీపై గడ్కరీతో సుదీర్ఘంగా సమావేశమై చర్చించారు. మంత్రితోపాటు హాజరైన తెలంగాణ ఎంపీలు పాల్గొన్నారు. మల్కాపూర్ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలు గా విస్తరించడంతో పాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలని గడ్కరీని కోరారు. పలు రోడ్లు, భవనాలపై చర్చించారు.
Guvvala Balaraju : అవినీతి ఆరోపణలు, వరుస విచారణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. PM Modi: ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాల తీరు బాధించింది మంగళవారం ఆయన మరోసారి ఈ రాజీనామాపై స్పందించారు. వ్యక్తిగత…
Murder : హైదరాబాద్‌లోని బోరబండ ఇంద్రానగర్‌లో మద్యం తాగిన ఇద్దరు కజిన్ల మధ్య జరిగిన గొడవ దారుణంగా మారింది. ఈ ఘర్షణలో ఒకరు రాతితో కొట్టి మరొకరిని హత్య చేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం, మృతుడు బసవరాజ్ (30), నిందితుడు ప్రేమ్‌రాజ్ ఇద్దరూ ఇంద్రానగర్ నివాసితులు. సోమవారం రాత్రి పార్వతీనగర్‌లో మద్యం సేవించిన సమయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చి నిద్రపోయారు. Jharkhand: శిబు సోరెన్‌కు నివాళులర్పిస్తూ ఎక్కి ఎక్కి ఏడ్చిన…
Snapchat: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికతో యువకుడు సహజీవనం చేసిన ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం, చిన్నతనం నుంచే తన అక్క, బావలకు దత్తతగా ఇచ్చిన ఓ బాలిక వారితోనే పెరిగింది. ఏడాది క్రితం పెంపుడు తల్లి అనారోగ్యంతో మరణించగా, పెంపుడు తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో బాలిక స్కూల్ మానేసి ఇంట్లోనే ఉంటోంది. Tollywood : టాలీవుడ్ లో సెటిల్ అవుతన్న పరభాష హీరోలు.. మన వాళ్ళకి…