2500 ఇటుకల బిల్లు రూ. 1.25 లక్షలు!
ఉత్తర్ ప్రదేశ్ లోని భాటియా గ్రామ పంచాయతీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2500ల ఇటుకల బిల్లులో ఏకంగా రూ. 1.25 లక్షలు వేశారు. సర్పంచ్, కార్యదర్శి సంతకం చేసిన ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పరిపాలనలో కలకలం మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భాటియా గ్రామంలో ఒక బిల్లులో 2500 ఇటుకల ధరను రూ.1.25 లక్షలుగా చూపించిన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను లేవనెత్తింది. ఈ విషయంపై మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వంలో భయం పట్టుకుంది. ఇటుకకు ఐదు రూపాయల చొప్పున 2,500 ఇటుకల బిల్లును జారీ చేసింది. ఇటుక సరఫరాదారు చేతన్ ప్రసాద్ కుష్వాహా, దీని కింద మొత్తం చెల్లింపు రూ. 1,25,000 గా చూపించారు. కరెక్ట్ గా చూస్తే రూ. 12,500 మాత్రమే అవుతుంది. సర్పంచ్, కార్యదర్శి సంతకంతో కూడిన ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది ప్రజల సమస్యలపై చర్చను అణగదొక్కే ప్రయత్నం
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఒకే రోజు పరిమితం చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. ఆదివారం ఒక్కరోజే సమావేశాలు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు, బట్టి గారు ముందే ప్రకటించారని, ఇది ప్రజల సమస్యలపై చర్చను అణగదొక్కే ప్రయత్నమని ఆయన అన్నారు. వరదల కారణంగా వేల ఎకరాల పంటలు నాశనం అయ్యాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కానీ ఆ అంశంపై కూడా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా లేనట్లు స్పష్టమైందన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుండగా, ముఖ్యమంత్రి దానిపై సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగుల సమస్య, రైతులు మరియు మహిళలకు ఇచ్చిన హామీలు, మాజీ సర్పంచుల బకాయిలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, రెవెన్యూ, విద్యుత్, వైద్య రంగ సమస్యలపై చర్చ జరగాలని బీజేపీ ప్రతిపాదించినా ప్రభుత్వం దానికి సంధానం లేకుండా తప్పించుకుంటోందని మండిపడ్డారు.
చంద్రబాబుకు అసలు పోలవరం గురించి ఏమీ తెలియదు.. చర్చకు మేం సిద్ధం!
సొమ్మొకడిది, సోకొకడిది అన్నట్లుంది సీఎం చంద్రబాబు వ్యవహారం అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పనిచేసేది ఒకరు, క్రెడిట్ పొందేది మరొకరు అని.. క్రెడిట్‌ని దొంగిలించగలగిన సమర్థుడు చంద్రబాబు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కుప్పం, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏరోజు రాలేదని.. బాబు ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసన్నారు. మాట ఇచ్చిన ప్రకారం వైఎస్ జగన్ కుప్పానికి నీళ్లు ఇచ్ఛారన్నారు. పోలవరం పనులు సరైన, సక్రమమైన పద్ధతుల్లో జరగడం లేదని మండిపడ్డారు. పోలవరం డయాఫ్రంవాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణం అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఈరోజు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్ గెలిచి నరేంద్రమోడీకి గిఫ్ట్ గా ఇద్దాం
హైదరాబాద్‌ను బీజేపీ కంచుకోటగా మలచామని, GHMC ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన విషయమే దీనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి మంచి ఓటు షేర్ రావడం ప్రజలు ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీనే భావిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలోని సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రామచందర్ రావు, “డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి, మ్యాన్‌హోల్స్ నోళ్లు తెరిచి ఉన్నాయి. వర్షాకాలం ప్రమాదాలపై ముందుగానే హెచ్చరించినా GHMC అధికారులు స్పందించడం లేదు. ఇది చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుంది” అని మండిపడ్డారు. ప్రభుత్వంపై కూడా దాడి చేసిన ఆయన, “ప్రజల ప్రాణాలు పణంగా పెట్టినా కళ్ళు తెరవడం లేదు” అని విమర్శించారు.
అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం.. తర్వాత ఏం జరిగిందంటే..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన రెండు రోజుల ముంబై పర్యటన ముగించుకుని గుజరాత్‌కు బయలుదేరబోతుండగా శనివారం ఆయన ప్రయాణిస్తున్న విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. విమానంలో సాంకేతిక లోపం గురించి సమాచారం అందిన వెంటనే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తన విమానాన్ని హోంమంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు అందించారని సమాచారం. అనంతరం షా తన కుటుంబంతో కలిసి షిండే విమానంలో గుజరాత్‌కు బయలుదేరారు.
ఓటేసినందుకు ము* కడగాలంటే కుదరదు.. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు..
కామారెడ్డిలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి వివాదస్పదంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ప్రళయం, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఏమీ చేయలేరు” అని వ్యాఖ్యానించారు. “ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఓవర్ కాన్పిడెన్స్ వల్లనే ఈ వరదలలో ప్రజలు చిక్కుకున్నారని” ఆయన తెలిపారు. “వరద తక్కువగా ఉన్నప్పుడు బయటకు వచ్చి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదు” అని ఆయన మరింత వివరణ ఇచ్చారు.
‘కాస్తైనా సిగ్గుండాలి’.. లలిత్ మోడీపై శ్రీశాంత్ సతీమణి ఫైర్!
ఐపీఎల్ 2008 సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, ఎస్ శ్రీశాంత్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. హర్భజన్.. శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటనకు సంబంధించిన వీడియోను 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ తాజాగా షేర్ చేశాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ పాడ్ కాస్ట్ సందర్భంగా అప్పటి వీడియోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. జనాలు మర్చిపోయిన ఈ ఘటనను లలిత్ మోడీ మరోసారి గుర్తుచేశాడు. ఈ వీడియోపై శ్రీశాంత్ సతీమణి భువనేశ్వరి కుమారి ఫైర్ అయ్యారు. మీరు అసలు మనుషులేనా?.. కాస్తైనా సిగ్గుండాలి అంటూ లలిత్ మోడీ సహా క్లార్క్‌పై మండిపడ్డారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్న నందమూరి నటసింహం
నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు రిజిస్టర్ అయింది. ఇప్పటికే ఈ అవార్డును సదరు సంస్థ ప్రకటించగా.. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్ లో బాలకృష్ణకు పురస్కారం అందజేశారు. ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి లోకేష్ హాజరయ్యారు. సంస్థ ప్రతినిధులు బాలకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బాలకృష్ణను అభినందించారు.
సగటు మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన పార్టీ.. నా నిర్ణయం సరైందే!
జనసేన 2014లో పోరాటాల గడ్డ తెలంగాణలో ప్రారంభించాం అని, ఆంధ్రప్రదేశ్‌లో నిలదొక్కుకున్నాం అని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సగటు మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన పార్టీ అని చెప్పారు. కులం, కుటుంబం, రాష్ట్రం, ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదన్నారు. ప్రజల కష్టాలు పరిష్కరించినప్పుడు తన నిర్ణయం సరైందే అనిపించిందన్నారు. పార్టీ మొదలుపెట్టినప్పుడు తన ఆలోచన సగటు మనిషి ఆలోచన అని.. జనాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆకాంక్షలు అర్థం చేసుకుని పార్టీ పెట్టానన్నారు. దశాబ్ద కాలం పాటు పార్టీ నడిపాను అని, జనసేన పెట్టిన తరవాత కుటుంబాన్ని విస్మరించానని, సినిమాలపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయానన్నారు. ఏరోజు కూడా పార్టీని, జనసైనికులను, వీరమహిళలను విడిచిపెట్టలేదని పేర్కొన్నారు. పార్టీ పెట్టినప్పుడు 150 మంది మాత్రమే తన వెంట ఉన్నారని.. ఈరోజు 18 వేల మంది క్రియాశీలక వాలంటీర్లు, 12 లక్షల మంది జనసేన క్రియాశీలక సభ్యులుగా జనసేన ఎదిగిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
బాలయ్య మంచి మనసు.. వరద బాధితులకు రూ.50 లక్షలు
నందమూరి బాలకృష్ణ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. తెలంగాణలో వరదలు నిండా ముంచేశాయి. అందులోనూ కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలను అతలాకుతలం చేసేశాయి. కామారెడ్డిలో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో టాలీవుడ్ నుంచి ఒక్కొక్కరుగా సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి మనసు చాటుకున్నాడు. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును అందుకున్నారు.