KTR : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసి నీటమునిగితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీహార్ లో టైమ్ పాస్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం అర్ధిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సీఎం అందుబాటులో ఉండాల్సింది పోయి.. బీహార్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అసలు తెలంగాణకు సంబంధం లేని బీహార్ లో ఈ టైమ్ లో సేదతీరడం అవసరమా అంటూ రాసుకొచ్చారు కేటీఆర్. అధిష్టానం ఆశీస్సుల కోసం తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు కేటీఆర్.
Read Also : Medak – Kamareddy : మెదక్, కామారెడ్డికి రెడ్ అలెర్ట్.. బయటకు రావొద్దు
వరదలతో ప్రజలు, యూరియా దొరక్క రైతులు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల వరదనీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో వారి కోసం హెలికాప్టర్లు ఎందుకు పంపించట్లేదు అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. వెంటనే సహాయ, సహకారాలు స్టార్ట్ చేసి ప్రజలను కాపాడాలి. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని కాపాడాలి అంటూ డిమాండ్ చేశారు కేటీఆర్.
Read Also : Heavy Rains : రాబోయే రెండు గంటలు అత్యంత భారీ వర్షాలు