యువత ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణ జరుపుతున్నారు.. మరోపక్క బెట్టింగ్ యాప్స్ కేసును PMLA చట్ట కింద కేసునమోదు చేసిన ఈడి సైతం, ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారిస్తుంది. అయితే దేశంలో బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు…
Bhatti Vikramarka : దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రంగా నిలిచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ ప్లాంట్లో రెండు యూనిట్ల ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. మిగిలిన మూడు…
Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడిరైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఒక వ్యక్తి బర్రెల షేడ్ను కూలగొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి బర్రెలను తోలాడు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పోలీసుల వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..
సంగారెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై టీజీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. న్యాయవాది కె.బాబూరావు సిగాచిపై పిల్ దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని, పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు.. పరిశ్రమ యజమానిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు..
Jagtial District: కొడుకంటే కష్టాలు కడతేర్చేవాడు.. కొడుకంటే కడుపున పెట్టుకొని కాపాడేవాడు.. కొడుకంటే ఇంటి బరువు మోసేవాడు.. కొడుకంటే ఇంటి పేరు నిలబెట్టేవాడు. మరి ఇక్కడ మాత్ర సీన్ రివర్స్ అయ్యింది. కర్కోటకుడిగా మారిన కొడుకు కన్న తండ్రినే దారుణంగా పొడిచేశాడు. 10 గుంటల భూమి కోసం ఈ ఘాతుకానికి పాల్పడి తండ్రీకొడుకుల బంధానికే కంట నీరు తెప్పించాడు. కని, పెంచి పెద్దచేసి ‘ప్రయోజకుడిని’ చేసినందుకు ప్రతిగా పేగుబంధమే వలవల ఏడ్చేలా చేశాడు. జగిత్యాల జిల్లా రాయికల్…
Telangana Cabinet : హైదరాబాద్లో సోమవారం ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 25 అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రవాణా, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి విభాగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. రవాణా శాఖకు సంబంధించిన ముఖ్య నిర్ణయంగా, రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ తేల్చింది. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో మొత్తం 15 చెక్…
‘‘పరువు హత్య’’.. 25 ఏళ్ల దళిత యువకుడి దారుణ హత్య.. తమిళనాడులో 25 ఏళ్ల దళిత యువకుడి హత్య సంచలనంగా మారింది. దీనిని ‘‘పరువు హత్య’’గా భావిస్తున్నారు. తూత్తుకుడికి చెందిన కవిన్ తిరునెల్వెలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి సమీపంలో హత్యకు గురయ్యాడు. కవిన్ ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కేటీసీ నగర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నా తన మాజీ స్కూల్ విద్యార్థినితో సంబంధం ఉందని తెలుస్తోంది. అమ్మాయి కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చినా,…
తెలంగాణ రవాణా శాఖలో సర్వీస్ ఛార్జీలు భారీగా పెరిగి వాహన యజమానులపై అదనపు భారం పడింది. టాక్సేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ సర్టిఫికెట్లకు సంబంధించిన ఛార్జీలను గణనీయంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Brave Incident: కాల్వ శ్రీరాంపూర్ మండలం జొన్నల మల్యాల సమీపంలోని నక్కల వాగులో కూలీలు చిక్కుకున్నారు. మల్యాల నుండి పోచంపల్లి వెళ్లే దారిలో నక్కల వాగు అవతలి ఒడ్డు వైపు ఉన్న రైతుల పొలాల్లో ఉదయం వరి నాట్ల కోసం పెద్దపల్లి మండలం గౌరెడ్డి పేట గ్రామం నుండి 15 మంది కూలీలు రావడం జరిగింది. ఉదయం వర్షం అంతంతమాత్రంగా ఉండడంతో అవతలి వైపుకు దాటిన కూలీలందరూ పని ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో మధ్యాహ్నం కురిసిన…
రాజకీయ ఎంట్రీకి కారణాలు ఇవే.. పాడ్కాస్ట్లో జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ.. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన రాజకీయ ఎంట్రీకి ఎక్కడ బీజం పడిందో చెప్పారు. ఆయన తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్నారు. పాఠశాల నాటి పరిస్థితులు, రాజకీయంపై ఆసక్తి పెరగడానికి గల కారణాలు వివరించారు. తాను ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని.. అక్కడి నుంచే రాజకీయాలను అనుసరిస్తూ ఉండేవాళ్లమని తెలిపారు. “చిన్నతనంలో ఉన్నప్పుడే రాజకీయాలను అనుసరిస్తూ ఉండేవాళ్లం. మేము…