ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు.. ఢిల్లీ, గురుగ్రామ్లో అలర్ట్ ! ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తాజాగా సంచలనం రేపిన ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధానిలో ఐదుగురు బాంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఎర్రకోట ఆవరణలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వయసు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండే ఈ యువకులు ఢిల్లీలో కూలీలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. వారిని అరెస్ట్ చేసే సమయంలో వారి వద్ద…
అమరావతి: నేడు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సమావేశం. పార్టీనేతలతో భేటీ కానున్న వైసీపీ అధినేత జగన్. తాజా రాజకీయ అంశాలపై జగన్ సమాలోచనలు. విశాఖ: నేడు అరుకు, విశాఖలో మంత్రి మనోహర్ పర్యటన. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమీక్ష. బియ్యం ఎగుమతులపై పోర్టు అధికారులతో సమావేశం. నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,950 లుగా ఉండగా..…
కవిత దీక్షకు కోర్టు నో.. ఇంటికి కవిత హైదరాబాద్ ధర్నాచౌక్లో కొనసాగుతున్న MLC కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష మంగళవారం డ్రామాటిక్ మలుపు తిరిగింది. కోర్టు అనుమతి నిరాకరించడంతో, పోలీసులు కవితను దీక్షా స్థలం నుంచి ఇంటికి తరలించే ఏర్పాట్లు ప్రారంభించారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే, పోలీసులు మరోసారి కవితను దీక్ష విరమించాలని కోరారు. అయితే కవిత అనుచరులు, జాగృతి కార్యకర్తలు దీక్ష కొనసాగించాలని పట్టుబట్టారు. పోలీసులు వారిని అడ్డుకుంటూ, వర్షం తగ్గిన…
కవిత ఎవరో నాకు తెలియదు.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీ ధర్నా జోక్ అని ఎద్దేవా చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కోట్లాడుతాం అని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను…
ఇవాళ శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ ఇవాళ ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. కొన్ని కీలక శాఖలకు సంబంధించి సమీక్ష.. జీఎస్డీపీపై సమీక్ష నిర్వహించే అవకాశం ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.10 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు బయలుదేరి 9.30…
విలాసవంతమైన జీవితాన్ని విడిచి.. సన్యాసిగా మారిన విదేశీ మహిళా డాక్టర్.. నేటి ప్రపంచంలో చాలా మంది డబ్బు, హోదా, విలాసాల కోసం పోటీ పడుతున్నారు. కానీ.. ఆత్మ శాంతి, జీవితానికి నిజమైన అర్థాన్ని వెతుక్కుంటూ భౌతిక సుఖాలను వదులుకునే వారు కొందరు ఉన్నారు. తాజాగా ఓ విదేశీ మహిళ విలాసవంతమైన జీవితం విడిచి సాధ్విగా మారింది. వృత్తిరీత్యా వైద్యురాలైన స్పానిష్ అమ్మాయి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. తమ దేశంలో అన్నీ వదిలి భారతదేశానికి వచ్చి సనాతన…
సృష్టి ఫెర్టలిటి సెంటర్ కేసులో మరొకరి అరెస్ట్ సృష్టి ఫెర్టలిటి సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో గోపాలపురం పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. కృష్ణ అనే ఏజెంట్ ను అరెస్ట్ చేశారు. నిన్న ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, రిసెప్షనిస్ట్ నందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఈ కేసులో అరెస్ట్ ల సంఖ్య 12కి చేరింది. విశాఖ పట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో పిల్లలను విక్రయించే వారి కోసం ఏజెంట్లు…
కలుషిత ఆహార నగరంగా విశాఖ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. విశాఖ కలుషిత ఆహార నగరంగా మారింది.. చిన్నపిల్లలు తినే తిండి దగ్గర నుంచి, మహిళలు, గర్భిణీలు తినే ఆహారాన్ని కల్తీ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. వారం రోజుల నిల్వ ఉంచిన ఫుడ్, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన మాంసపు పదార్థాలతో వంటకాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల జాయింట్ ఆపరేషన్లో భాగంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన…
నిత్య పెళ్లికూతురు.. 8 మందితో వివాహం, 9వ పెళ్లిలో పట్టుబడిన మహిళ.. ఆమెకు అప్పటికే 8 మంది పురుషులతో వివాహమైంది. పెళ్లి చేసుకోవడం ఎంచక్కా భర్తల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకుంది. చివరకు 9వ పెళ్లి చేసుకునే సమయంలో పోలీసులకు పట్టుబడింది ఈ కిలాడీ ‘‘నిత్య పెళ్లికూతురు’’. మహారాష్ట్ర నాగ్పూర్లో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పురుషులను వివాహం చేసుకుని, వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో…
మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి .. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఇవాళ రాత్రి ఢిల్లీకి చేరుకొని, రేపు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగే జరిగే న్యాయసదస్సు కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు.. కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్, సమాచార చట్టానికి స్పందించిన అంశాలపై వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు.. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సదస్సుకు, ఎఐసిసి ముఖ్య నేతలతో పాటూ,…