Sahasra M*rder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపిన 10 ఏళ్ల సహస్ర హత్య కేసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో పదో తరగతి చదువుతున్న బాలుడు హంతకుడిగా తేల్చిన పోలీసులు.. బ్యాట్ కోసం వెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. అయితే.. ఇప్పటికే బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు. తమ బంధువులతో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు.…
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిషేధ నిర్ణయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షించారు. ఇప్పటికే ఈ యాప్స్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు మోసపోయారని, ఆర్థికంగా కూలిపోయారని గుర్తుచేశారు.
హైదరాబాద్ మహానగరంలో పండగ వేళ విషాదం వరుసగా దాడి చేస్తోంది. గత రెండు రోజుల్లోనే కరెంట్ షాక్‌ల కారణంగా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతాపూర్ గోఖుల్‌నగర్‌లో నిర్వహించిన రథోత్సవం సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు.
గణేష్ ఉత్సవాల మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి పొన్నం ప్రభాకర్! MCRHRD లో గణేష్ ఉత్సవాలు 2025 పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డీజీపీ జితేందర్.. జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్,హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు హైదరాబాద్ ,మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఇంకా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇక…
Telangana Floods: తెలంగాణలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాజెక్టులు పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటి విడుదల జరుగుతుండగా, విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సాత్నాల, మత్తడి వాగు…
షాకింగ్.. అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు సతీమణి మృతి! ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి, ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. నిజానికి, కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచే రుక్మిణి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక, ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు సమాచారం. ఇక, కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు కూడా హైదరాబాద్‌లో పూర్తయినట్లు తెలుస్తోంది. కోట శ్రీనివాసరావు, రుక్మిణి…
RS Praveen: కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కుట్ర ప్రకారం కూల్చివేశాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుళ్ళు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లే కారణమని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు... వారి అనుచరుల ఫోన్ కాల్స్ టేడాను బయటకు…
Bandi Sanjay: మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మర్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘మర్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు.
POCSO: చిన్నారుల జీవితాలను మొగ్గలోనే చిదిమేస్తున్నారు కామాందులు. ఆభం శుభం తెలియని వారి ప్రాణాలను.. కొందరు మృగాళ్లు తమ కామవాంఛ కోసం గాల్లో కలిపేస్తున్నారు. ఇలాగే కామంతో కళ్లు మూసుకుపోయి ఓ చిన్నారిని చిదిమేసిన మానవ మృగానికి ఉరిశిక్ష విధించింది నల్లగొండ జిల్లా ఫోక్సో కోర్టు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత దారుణంగా హత్య చేసిన మానవ మృగానికి.. నల్లగొండ జిల్లా ఫోక్సో కోర్టు ఉరి శిక్ష విధించింది. అంతే కాదు దోషికి రెండు…