Bandi Sanjay : నర్మాల గ్రామస్తుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను ప్రజలు ఎంతగానో కొనియాడుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నర్మాల గ్రామంలో చిక్కుకుపోయిన ఐదుగురు గ్రామస్తులను సురక్షితంగా కాపాడటంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం. వరదల్లో ప్రజలు చిక్కుకున్నారని తెలిసిన వెంటనే బండి సంజయ్ కుమార్ యుద్ధ ప్రాతిపదికన రక్షణ శాఖ మంత్రితో మాట్లాడారు. ఆయన విజ్ఞప్తి మేరకు, రక్షణ శాఖ తక్షణమే స్పందించి నాలుగు ఆర్మీ హెలికాప్టర్లను పంపింది. ఈ హెలికాప్టర్లలో రెండు, నర్మాల గ్రామంలో చిక్కుకున్న ఐదుగురిని విజయవంతంగా కాపాడాయి. మిగిలిన రెండు హెలికాప్టర్లను సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పంపి, అక్కడ ముంపు బాధితులకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉంచారు.
Mirai : నాకు పాన్ ఇండియా హీరో అవ్వాలని లేదు.. తేజ
ముంపునకు గురైన ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎన్‌డిఆర్‌ఎఫ్ (NDRF) సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. అంతేకాకుండా, ఆయన నిరంతరం జిల్లా కలెక్టర్ఎ, స్పీలతో మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షించారు. వరదల్లో గల్లంతైన నాగం కుటుంబాన్ని ఆయన పరామర్శించి, వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. వరద బాధితులను పరామర్శించి తిరిగి వస్తుండగా, నర్మాల గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్ బండి సంజయ్‌కు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ కేంద్ర మంత్రి వద్దకు వచ్చి అభివాదం చేశారు. ఈ సంఘటన ఇరువురు నాయకుల మధ్య ఉన్న రాజకీయాలకు అతీతమైన మర్యాదను తెలియజేస్తుంది.
Daniil Medvedev: ప్రేక్షకులతో అనుచిత ప్రవర్తన.. స్టార్ ఆటగాడికి 37 లక్షలు జరిమానా!